శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సందీప్
Last Updated : శుక్రవారం, 8 మార్చి 2019 (17:00 IST)

మూడో పెళ్లి చేసుకున్నాడని.. ఒళ్లు మండి రెండో భార్య చంపేసింది..

మూడో పెళ్లి చేసుకున్నాడని ఒళ్లు మండిన రెండో భార్య ఆమెను హత్య చేసింది. దానికి మొదటి భార్య పిల్లలు కూడా సహకరించారు. ఈ ఘటన ముంబయ్ సమీపంలో చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని నలసపోరా ఏరియాలో ఉంటున్న సుశీల్ అనే వ్యక్తికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 


వారు ఉండగానే 2017లో పార్వతి అనే ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువతిని మరో పెళ్లి చేసుకున్నాడు. ఆమెను మొదటి భార్య ఉంటున్న ఇంటికి దగ్గర్లో ఓ ఇంటిని తీసుకుని అందులో కాపురం పెట్టాడు. అయినా మొదటి భార్య సహించింది. 
 
ఇద్దరూ అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్నారు. రెండవ భార్యకు కూడా ఇద్దరు పిల్లలు కలిగారు. ఇద్దరు భార్యలు చాలరన్నట్లు మూడో పెళ్లికి సిద్ధమయ్యాడు సుశీల్. యోగిత అనే అమ్మయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువచ్చి వారికి షాక్ ఇచ్చాడు. అతని జీవితంలో యోగిత ప్రవేశించినప్పటి నుండి ఇద్దరు భార్యలను పట్టించుకోవడం మానేశాడు. డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాడు. 
 
కుటుంబ పరిస్థితి దయనీయంగా మారింది. ఇదంతా చూసి కడుపు మండిన రెండో భార్య మూడవ భార్యపై కక్ష పెంచుకుంది. ఆమెను హత్య చేయడానికి ప్లాన్ చేసింది. ఇందుకు మొదటి భార్య కూతుళ్ల సహాయం కోరింది. అనుకున్న ప్రకారం పార్వతి వారితో కలిసి యోగితను కత్తితో పొడిచి చంపేసింది. పిల్లలతో సహా మరో నలుగురు స్నేహితులు కూడా ఇందులో పాలుపంచుకున్నారని సమాచారం. 
 
మృతదేహాన్ని దూరంగా ఉన్న చెత్త కుండీలో పారేశారు. గత నెల 28న యోగిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందిదని తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని పరిశీలించారు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మరో విషయం ఏమిటంటే ఆ పిల్లలు స్కూల్‌లో చదువుకుంటున్నారు.