మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వాసుదేవన్
Last Updated : శుక్రవారం, 8 మార్చి 2019 (14:12 IST)

రాంగ్ రూట్‌లో వస్తారా అన్నందుకు ఆ యువకులు ఏం చేసారో తెలుసా..?

నేటి సమాజంలో ప్రాణానికి విలువ లేకుండా పోయింది. ప్రతి చిన్న విషయానికి హత్య చేయడమో, ఆత్మహత్య చేసుకోవడమో సాధారణం అయిపోయింది. కొన్నిసార్లు ఈ మరణాలకు కారణాలు చాలా సిల్లీగా ఉంటాయి. ఇటువంటి సంఘటన ఇటీవల చోటు చేసుకుంది.
 
వివరాలలోకి వెళ్తే, రాంగ్ రూట్‌లో వస్తున్న ఇద్దరు యువకులను ఒక ఆటో డ్రైవర్ అడ్డుకుని ప్రశ్నించినందుకు ఆ డ్రైవర్‌ను హత్య చేసిన దారుణం తమకూరులోని బనశంకరిలో జరిగింది. ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న 30 ఏళ్ల అస్గర్‌ గురువారం బనశంకరి లేఔట్‌ మీదుగా వెళ్తున్నప్పుడు ఎదురుగా ఇర్ఫాన్, ఫయాజ్‌ అనే ఇద్దరు యువకులు బైక్‌పై వచ్చారు.
 
వారు రాంగ్ రూట్‌లో వస్తున్నట్లు గమనించిన అస్గర్ వారిని ప్రశ్నించగా ఆ యువకులిద్దరూ కత్తితో అతనిపై దాడి చేసి గాయపరిచారు. స్థానికులు గమనించి హాస్పిటల్‌లో చేర్చగా చికిత్స పొందుతూ అస్గర్ మరణించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ మొదలుపెట్టారు.