శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 7 మార్చి 2019 (17:01 IST)

సమాధిని తవ్వి తలను తీసుకెళ్ళారు.. ఎందుకు..?

దొడ్డబళ్లాపురంలోని ఓ గ్రామ నివాసి చనిపోయి 2 నెలలు పూర్తయ్యింది. ఆ శవాన్ని తవ్వి తలను మాత్రం తీసువెళ్లారట. ఈ ఘటన నెలమంగల తాలుకా భైరనపహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. వీటి వివరాల్లో వెళ్తే..
 
శ్మశానంలో పూడ్చి పెట్టున్న శవాన్ని బయటకు తీసిన దుండగులు.. తలను మాత్రం తీసుకుపోయారు. ఆ శవం ఎవరిదని చూస్తే.. భైరనహళ్లి గ్రామం నివాసి అరసయ్య వయోభారంతో జనవరి 13న మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గ్రామ శివారులోని శ్మశానంలో పూడ్చిపెట్టారు. అయితే.. మంగళవారం నాడు అంటే.. మార్చి 5వ తేదీన రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పూడ్చున్న శవాన్ని తవ్వి బయటకు తీసి తలను మాత్రం కత్తిరించుకుని వెళ్లిపోయారు.
 
బుధవారం నాడు శ్మశానం వైపు వెళ్లిన స్థానికులు తలలేని శవాన్నిచూసి భయాందోళనకు గురయ్యారు. దాంతో ఏం చేయాలో తెలియక.. వెంటనే నెలమంగల రూరల్ పోలీసులకు ఈ ఘటన గురించి తెలియజేశారు. తక్షణమే పోలీసులకు శ్మశానానికి వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కుటుంబ సభ్యులు మొండాన్ని తిరిగి పూడ్చి పెట్టారు. బుధవారం ( మార్చి 6) అమావాస్య కావడంతో చేతబడి కోసమే మాంత్రికులు ఈ చర్యలకు పాల్పడి ఉంటారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు.