1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. President Ramnath Kovind to undergo coronavirus test: Sources

రాష్ట్రపతికి కరోనా పరీక్షలు.. అన్ని కార్యక్రమాలు రద్దు

Covid 19
కరోనా వైద్య పరీక్షలు చేయించుకోవాలని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ నిర్ణయించుకున్నారు. దీంతో ఆయన అన్ని రకాల అధికారిక, వ్యక్తిగత పర్యటనలను రద్దు చేసుకున్నారు. 
 
ఇటీవల బాలీవుడ్ సింగ్ కనికా కపూర్ లండన్‌ పర్యటనకు వెళ్లి వచ్చింది. ఆ తర్వాత ఆమె ఎలాంటి వైద్య పరీక్షలు చేయించుకోకుండానే, పార్టీ ఇచ్చింది. ఈ పార్టీకి అనేక మంది సినీ సెలెబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, హితులు, సన్నిహితులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కనికాకు పరీక్షలు చేయగా, ఆమెకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఆమె పార్టీలో పాల్గొన్నవారందరికీ ఈ వైరస్ సోకిందన్న భయం పట్టుకుంది.
 
ఇదిలావుంటే, పార్టీకి బీజేపీ యువ ఎంపీ దుష్యంత్ సింగ్ కూడా హాజరయ్యారు. కనికకు 'కరోనా' ఉందన్న వార్తల నేపథ్యంలో తనకు కూడా ఈ వైరస్ సోకిందన్న అనుమానంతో ఆయన హోం క్యారంటైన్‌కు వెళ్లారు. ఆ తర్వాత ఆయన బీజేపీ ఎంపీల బృందంతో వెళ్లి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. 
 
ఈ నేపథ్యంలో, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రామ్ నాథ్ కోవింద్ వైద్య పరీక్షలు చేయించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపాయి. అలాగే అన్ని అధికారిక కార్యక్రమాలను ఆయన రద్దు చేసుకున్నట్టు సమాచారం.
తర్వాతి కథనం
కరోనా ఎఫెక్ట్... ఏపి/టీఎస్ భవన్‌ క్యాంటీన్ మూసివేత