సంబంధిత వార్తలు
- ప్రజలకు క్షమాపణలు చెప్పిన హీరో విజయ్.. ఎందుకంటే?
- అన్నాడీఎంకే మాజీ మంత్రిపై ఏసీబీ పంజా - ఏకకాలంలో 69 చోట్ల తనిఖీలు
- నీట్ పరీక్షల నుంచి వైదొలగే ముసాయిదా: సీఎం స్టాలిన్ అదుర్స్
- తమిళనాడు మాజీ సీఎం ఓపీఎస్కు సతీవియోగం : సీఎం స్టాలిన్ పరామర్శ
- వి.కె శశికళపై మరో కేసు.. మళ్లీ పార్టీలోకి అన్నాడీఎంకేలోకి ఎంట్రీ
తమిళనాడు పురపోరు : దూసుకుపోతున్న అధికార డీఎంకే
తమిళనాడు రాష్ట్రంలో నగర, పురపాలక, పట్టణ పంచాయతీలకు ఈ నెల 19వ తేదీన ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం చేపట్టారు. ఇందులో అధికార డీఎంకే సారథ్యంలోని డీఎంకే - కాంగ్రెస్ కూటమి విజయభేరీ మోగించే దిశగా దూసుకెళుతుంది.
ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన ఈ ఓట్ల లెక్కింపులో డీఎంకే కూటమిలోని పార్టీలు విజయం దిశగా దూసుకెళుతున్నాయి. గత పదేళ్ళపాటు అధికారంలో ఉన్న అన్నాడీఎంకే నామమాత్రపు ఫలితాలను కూడా సాధించేలా కనిపించడం లేదు.
ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల ప్రకారం 1374 కార్పొరేషన్ వార్డులకు గాను డీఎంకే 57, అన్నాడీఎంకే 7 స్థానాలను, ఇతరులు 8 చోట్ల గెలిచారు. ఇకపోతే డీఎంకే మిత్రపక్షాలైన కాంగ్రెస్ 7, సీపీఎం 2చొప్పున గెలుచుకున్నాయి.
మున్సిపాలిటీల్లో 3843 వార్డులకు గాను డీఎంకే 248 చోట్ల విజయం సాధించింది. అన్నాడీఎంకే 79, ఇతరులు 53 చోట్ల గెలుపొందారు. పట్టణ పంచాయితీ వార్డుల్లో 1251 వార్డుల్లో డీఎంకే విజయభేరీ మోగించింది. అన్నాడీఎంకే 354 స్థానాల్లో గెలుపొందింది.
తర్వాతి కథనం
