1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. three tenth class students gang rape on 8th class girl

నగరంలో పేరెంట్స్, ఇంట్లో ఒంటరిగా బాలిక, ముగ్గురు టెన్త్ క్లాస్ విద్యార్థులు గ్యాంగ్ రేప్

tenth class
తల్లిదండ్రులు బ్రతుకుదెరువు కోసం చెన్నై నగరానికి వచ్చారు. కుమార్తె సొంత ఊరులో బంధువుల ఇంట్లో వుండి 8వ తరగతి చదువుకుంటోంది. ఆమెపై కన్నేశాడు సమీపంలో వున్న ఓ విద్యార్థి. పదో తరగతి చదువుతున్న ఆ విద్యార్థి మాయ మాటలు చెప్పి ఆమెకి దగ్గరయ్యాడు. అత్యాచారం చేసాడు.
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని కల్లకురిచ్చి జిల్లా తిరునావలూరుకు చెందిన 13 ఏళ్ల బాలిక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటోంది. ఈ బాలికతో ఆమె ఇంటికి కాస్త సమీపంలో వుండే పదో తరగతి విద్యార్థి పరిచయం పెంచుకున్నాడు.
 
బంధువులు ఇంట్లో వున్న ఆమె ఒంటరిగా ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురుచూసాడు. ఆ అవకాశం రాగానే ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత తన ఇద్దరు స్నేహితులను పిలిచి వారితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
 
ఆ తర్వాత ఆ ఘటన తాలూకు వీడియోలు తీసి వాటిని చూపించి తమ కోర్కె తీర్చాలంటూ పలుమార్లు లైంగిక దాడి చేశారు. ఇటీవల ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు తమ కుమార్తెలో ఏదో తేడా గమనించి గట్టిగా నిలదీసారు. దీనితో జరిగిన విషయం చెప్పింది. వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అఘాయిత్యం చేసిన వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మూడో విద్యార్థి పరారీలో వున్నాడు. అతడి కోసం గాలిస్తున్నారు.
About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
సీఎం జగన్ సహకారంతోనే చైర్మన్‌నయ్యా: తెదేపాకి జేసీ ప్రభాకర్ రెడ్డి సునామీ షాక్