మంగళవారం, 15 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 మార్చి 2021 (18:28 IST)

కరోనా: 1-8 తరగతుల వరకు స్కూళ్ల మూసివేత.. తెలంగాణ సర్కారు

కరోనా నేపథ్యంలో 1-8వ తరగతి వరకు స్కూళ్లను మూసివేసే యోచనలో తెలంగాణ సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో 6వ తరగతి నుంచి స్కూళ్లు కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం 1 నుంచి 8 తరగతుల విద్యార్థులను పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేసే ఆలోచనలో విద్యాశాఖ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 
 
పరీక్షపై కేసీఆర్ త్వరలో నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. గతవారం రోజుల నుంచి రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, కరోనాపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. 
 
బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడుతూ కరోనా విషయంలో గతంలో కూడా ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు చేపట్టిందన్నారు. దేశంలో కంటే తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి చాలా మెరుగ్గా ఉందన్నారు. కరోనాపై ఎప్పటికప్పుడు కేంద్రం నుంచి సూచనలు వస్తున్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు.
 
విద్యాసంస్థల్లో కరోనా వ్యాపించకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. నూతనంగా నిర్మిస్తున్న సచివాలయంలోని ప్రార్ధన మందిరాలను తిరిగి అదే స్థలంలో పునర్‌నిర్మిస్తామన్నారు. గతంలో ఉన్న రూ.200 పెన్షన్‌ను రూ.2వేలకు పెంచామని సీఎం కేసీఆర్ అన్నారు.