శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 మార్చి 2021 (17:26 IST)

వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. మీ ఛాట్స్‌కి పాస్‌వర్డ్ పెట్టుకోవచ్చు

భారత్‌లో కోట్ల సంఖ్యలో యూజర్లు వినియోగిస్తున్న యాప్‌లలో వాట్సాప్‌ ఒకటి. ఇప్పటికే ఎన్నో కొత్త ఫీచర్లను యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది వాట్సాప్‌. ప్రస్తుతం వాట్సాప్‌లోని ఛాట్‌ను బ్యాకప్‌ చేస్తే గూగుల్‌ డ్రైవ్‌లోకి వెళుతుండగా.. దానికి ఎలాంటి పాస్‌వర్డ్‌ ప్రొటెక్షన్‌ లేదు. దీంతో ఛాట్‌ను బ్యాకప్‌ చేసినప్పుడు పాస్‌వర్డ్‌ పెట్టుకునే ఫీచర్‌ను వాట్సాప్‌ తీసుకొస్తుంది. ఆ ఛాట్స్‌ను రీస్టోర్‌ చేయాలంటే పాస్‌వర్డ్‌ తప్పనిసరి కానుంది. 
 
ప్రస్తుతం ఈ ఫీచర్‌ టెస్టింగ్‌ దశలో ఉండగా... త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్‌ అందుబాటులోకి వస్తే..వాట్సాప్‌ యూజర్లకు ఎంతో ప్రయోజనం కలుగనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను వాట్సప్ బీటా యూజర్లు టెస్ట్ చేస్తున్నట్టు WABetaInfo సమాచారం ఇచ్చింది. ఈ ఫీచర్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ని కూడా షేర్ చేసింది. 
 
వాట్సప్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ యాప్స్‌కి ఈ ఫీచర్ పనిచేస్తుంది. ప్రస్తుతం వాట్సప్‌లోని ఛాట్స్ బ్యాకప్ చేస్తే గూగుల్ డ్రైవ్‌లోకి బ్యాకప్ అవుతుంది. దీనికి ఎలాంటి పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ లేదు. ముఖ్యమైన ఛాట్స్ బ్యాకప్ చేయాలనుకునేవారి కోసం పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ తీసుకొస్తోంది వాట్సప్. పాస్‌వర్డ్ సెట్ చేస్తే ఆ ఛాట్స్‌ని రీస్టోర్ చేయాలంటే పాస్‌వర్డ్ తప్పనిసరి.