శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 మార్చి 2021 (11:08 IST)

వావ్.. వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్.. డెస్క్‌టాప్ ద్వారా వీడియో కాల్స్!

Whatsapp
సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను కస్టమర్లకు అందించనుంది. కరోనా వైరస్ సంక్షోభంలో జూమ్ యాప్, గూగుల్ మీట్ లాంటివాటికి డిమాండ్ పెరిగిపోయింది. ఇప్పటికీ వీడియో కాల్స్‌కి డిమాండ్ బాగానే ఉంది. ఈ నేపథ్యంలో వాట్సప్ కూడా డెస్క్‌టాప్ ద్వారా వీడియో కాల్స్, గ్రూప్ కాల్స్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం కొత్త ఫీచర్ లాంఛ్ చేసింది. 
 
డెస్క్‌టాప్‌లో వీడియో కాల్స్ ఫీచర్‌ని వాట్సప్ తీసుకొస్తుందన్న ప్రచారం చాలాకాలంగా ఉంది. మొత్తానికి ఈ ఫీచర్ వచ్చేసింది. కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లో వాట్సప్ వెబ్ ఉపయోగించేవారికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ ఐదేళ్లు పాతదైనా వాట్సప్ ద్వారా వాయిస్ కాల్స్ వీడియో కాల్స్ చేసుకోవచ్చు. ఇందుకోసం వాట్సప్ సూచించినట్టుగా కాన్ఫిగరేషన్ ఉంటే చాలు. వాట్సప్ డెస్క్‌టాప్ ద్వారా చేసే వీడియో కాల్స్, వాయిస్ కాల్స్‌కి కూడా ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంటుందని వాట్సప్ ప్రకటించింది. 
 
డెస్క్‌టాప్‌లో వాట్సప్ కాలింగ్ ఫీచర్ వాడుకోవాలంటే Windows 10 64-bit version 1903 లేదా అంతకన్నా కొత్తది ఉండాలి. macOS 10.13 లేదా అంతకన్నా లేటెస్ట్ వర్షన్ ఉండాలి. వీటితో పాటు యాక్టీవ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. కంప్యూటర్‌తో పాటు ఫోన్‌కు ఇంటర్నెట్ కనెక్షన్ తప్పనిసరి. 
 
మొదట కంప్యూటర్‌లో, ఫోన్‌లో ఇంటర్నెట్ ఆన్ చేయాలి. వాయిస్ కాల్స్ చేయాలంటే కంప్యూటర్‌కు మైక్రోఫోన్, వీడియో కాల్స్ కోసం వెబ్‌క్యామ్ తప్పనిసరి. ఆడియో ఔట్‌పుట్ డివైజ్ కూడా ఉండాలి. ఆ తర్వాత ఎవరిదైనా చాట్ ఓపెన్ చేసి వాయిస్ కాల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే కాల్ కనెక్ట్ అవుతుంది. వీడియో కాల్ చేయాలంటే వీడియో కాల్ ఐకాన్ పైన క్లిక్ చేయాలి.