శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 13 మార్చి 2021 (17:08 IST)

జెఇఇ మెయిన్స్ 2021 తెలంగాణలో ఆకాష్ ఇనిస్టిట్యూట్ నుండి ఏడుగురు విద్యార్థులు 99 శాతం ఫలితాలు

ఆకాష్ ఇనిస్టిట్యూట్ నుండి ఏడుగురు ప్రతిభావంతులైన విద్యార్థులు జెఇఇ మెయిన్స్ 2021 పరీక్ష ఫిబ్రవరి సెషన్లో 99 శాతం సాధించి, ఇనిస్టిట్యూట్ మరియు తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా మారారు.

ఈ విద్యార్థులలో 99.99 శాతం సాధించిన శ్రీనికేతన్ జోషి, 99.93 శాతం సాధించిన గౌతమ్ సింగ్, 99.76 శాతం సాధించిన కె.ఎస్. మకరంద్, 9.75 శాతం సాధించిన ఆదిత్య కల్లూరి, 99.72 శాతం సాధించి మొహమ్మద్ అరీబుస్సేన్, 99.23 శాతం సాధించిన అనికేత్ పరకాల మరియు అనమోల్ కురోతె వరసగా ఫలితాలు సాధించి ప్రముఖంగా గుర్తించదగినవారు అయ్యారు. ఈ ఫలితాలు నేడు నేషనల్ టెస్టింగ్ ద్వారా ప్రకటించబడినవి. ఇది ఈ సంవత్సరం ఇంజనీరింగ్ కొరకు షెడ్యూల్ చేసిన నాలుగు జాయింట్ ఎంట్రన్స్ పరీక్షలలో మొదటిది.
 
విద్యార్థులను అభినందిస్తూ, శ్రీ ఆకాష్ చౌదరి, డైరెక్టర్ మరియు సిఇఒ, ఆకాష్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ లిమిటెడ్ (AESL), “కఠినమైన జెఇఇ మెయిన్స్ 2021 పరీక్షలో మా విద్యార్థులు శ్రీనికేతన్, గౌతమ్, కె.ఎస్. మకరంద్, ఆదిత్య, మొహమ్మద్, అనికేత్, అనమోల్ జెఇఇ మెయిన్స్ 2021 పరీక్ష ఫిబ్రవరి సెషన్లో అత్యధిక శాతం పాదించి ఆధిక్యత పొందడం మాకు గొప్ప గర్వకారణంగా ఉంది.
 
విద్యార్థి యొక్క కఠి పరిశ్రమ, వారి తల్లిదండ్రుల అండదండలు, మరియు వారి ప్రయాణం అంతటా వారికి మార్గదర్శనం అందించిన అతని ఉపాధ్యాయులకు ఈ గౌరవం దక్కుతుంది. మెడికల్ మరియు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షలలో అత్యుత్తమ ఫలితాలు సాధించుటకు విద్యార్థులను తయారుచేయుటలో పరిశ్రమలో మా క్వాలిటీ టెస్ట్ ప్రిపరేషన్ అత్యంత ప్రఖ్యాతి పొందింది. భవిష్య ప్రయత్నాలలో వీరందరికి మరిన్ని విజయాలు లభించాలని నేను ఆశిస్తున్నాను” అని అన్నారు.
 
విద్యార్థులు తమ కఠిన పరిశ్రమ చూపించి, ఆకాష్ ఉపాధ్యాయుల ద్వారా అందజేయబడే అత్యుత్తమమైన కోచింగ్‌తో దానిని జోడించి, ప్రపంచంలో అత్యంత కఠినమైనదిగా భావించబడే ఐఐటి-జెఇఇ పరీక్షలో అసాధారణమైన పలితాన్ని సాధించారు. ఈ జెఇఇ మెయిన్స్ పరీక్ష NITs, IIITs మరియు CFTIs అడ్మిషన్‌కు వర్తిస్తుంది.
 
దేశవ్యాప్తంగా జెఇఇ మెయిన్స్ కొరకు 6.5 లక్షలకు పైగా విద్యార్థులు రిజిస్టర్ చేసుకోవటాన్ని దృష్టిలో పెట్టుకుంటే, ఇది నిజంగా ఒక ప్రభావవంతమైన గొప్ప కార్యం.