1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Corona pandemic in Thirumala .. Positive for 57 Vedic school students

తిరుమలలో కరోనా కలకలం.. వేద పాఠశాల విద్యార్థులు 57 మందికి పాజిటివ్

57 students
తిరుమలలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా తిరుమల వేద పాఠశాలలో కరోనా కలకలం రేపింది. ఏకంగా 57 మంది వేద పాఠశాల విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. గత నెలలోనే పాఠశాల ప్రారంభంకాగా... 450 మందికి కొవిడ్ టెస్టులు చేయించారు. 
 
వీరిలో 57 మందికి పాజిటివ్ రిపోర్టు రావడంతో.. వెంటనే వారిని తిరుపతిలో స్విమ్స్‌కి తరలించారు. డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు.. వీరిలో కొంతమందికి కరోనా లక్షణాలు లేవని తెలుస్తోంది. 
 
ముందస్తు జాగ్రత్తగా పాజిటివ్ తేలిన విద్యార్థులకు దగ్గరగా ఉన్నవారిని క్వారంటైన్‌లో ఉంచారు. వేద పాఠశాలలో విద్యార్థులకు కరోనా ఉందని తేలడంతో టీటీడీ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తర్వాతి కథనం
ఓటు హక్కును వినియోగించుకున్న పవన్ కళ్యాణ్