1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. The public fight wins on the court: Former Minister Devineni Uma

న్యాయస్థానంలో ప్రజా పోరాటం గెలుస్తుంది: మాజీ మంత్రి దేవినేని ఉమా

public fight
అమరావతి ఐక్యకార్యాచరణ సమితి (జెఎసి) పిలుపు మేరకు అమరావతి "ఆంధ్రుల రాజధాని సమరభేరీ" కార్యక్రమంలో భాగంగా జి.కొండూరులో కాగడాల ప్రదర్శన మరియు  స్కై లాంతర్ల ఎగరవేసే కార్యక్రమం తెదేపా నేతలతో కలిసి మాజీ మంత్రి దేవినేని ఉమా నిర్వహించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నవ్యాంధ్ర రాజధానిగా అమరావతే ఉండాలని రైతులు, రైతుకూలీలు, మహిళా రైతులు చేస్తున్న ఉద్యమం ఇవాళ్టికి 299వ రోజుకు చేరుకుందన్నారు.

న్యాయస్థానంలో ప్రజాపోరాటమే గెలుస్తుందన్నారు. ప్రజా రాజధాని అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో నాలుగు వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయని ఉమ ఆరోపించారు.

విశాఖలో భూదందా, భూ దోపిడి జరుగుతోందన్నారు. ఈ ప్రభుత్వం దోచుకున్న భూములను అమ్ముకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి తెలిపారు.
తర్వాతి కథనం
రేప్ కేసుల విచారణపై కొత్త గైడ్ లైన్స్