నోరూరించే గోంగూర మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం..
Biryani
కావలసిన పదార్థాలు :
బియ్యం - కేజీ
మటన్ - కేజీ
గోంగూర తరుగు - నాలుగు కప్పులు
పెరుగు - 2 కప్పులు
పచ్చిమిర్చి - ఏడు
నెయ్యి - 1 కప్పు
దాల్చిన చెక్క- 2 చిన్న ముక్కలు
అల్లంవెల్లుల్లి పేస్ట్ - 3 టేబుల్ స్పూన్స్
లవంగాలు - 4
యాలకులు - 4
కారం - 2 టేబుల్ స్పూన్స్
పుదీనా తరుగు - 4 కప్పులు
ఉల్లిపాయ తరుగు - మూడు కప్పులు
ఉప్పు - తగినంత
తయారీ విధానం:
ముందుగా బాస్మతి బియ్యం కడిగి అరగంట నానబెట్టాలి. తర్వాత గిన్నెలో నూనె వేసి వేడైన తరువాత లవంగాలు, సాజీరా, యాలకులు, దాల్చిన చెక్క నిలువుగా తరిగిన మిర్చి, ఉల్లి ముక్కల్ని వేసి దోరగా వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పుదీనా వేసి రెండు నిమిషాల తరువాత గోంగూర వేయాలి. తర్వాత పెరుగు, చికెన్, కారం, ఉప్పు వరుసగా వేసి సన్నటి సెగపై ఉడికించాలి.
మరో గిన్నెలో నీటిని మరిగించి అందులో నానబెట్టిన బియ్యం వేయాలి. అన్నం సగం ఉడికిన తరువాత దాన్ని వార్చి చికెన్ ఉడుకుతున్న గిన్నెలోకి వేయాలి. ఆవిరి పోకుండా ఉండేలా నిండుగా మూతపెట్టి, ఆ తర్వాత సన్నటి సెగపై 20 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతే వేడి వేడి గోంగూర మటన్బిర్యానీ రెడీ అయినట్లే. ఈ గోంగూర మటన్ బిర్యానీకి.. ఉల్లి పెరుగు లేదంటే.. చికెన్ 65 సైడిష్‌తో టేస్ట్ చేస్తే రుచి అదిరిపోతుంది.
