బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 జులై 2020 (20:10 IST)

''డోన్ట్‌ బ్రీత్'' హాలీవుడ్ రీమేక్‌లో శ్రుతిహాసన్.. అక్షరహాసన్..

Shruti Haasan-Akshara Hassan
హాలీవుడ్‌లో విశేష ప్రేక్షకాదరణ పొందిన హర్రర్‌ సినిమా 'డోన్ట్‌ బ్రీత్‌'. ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేసేందుకు సినీ లెజెండ్ కమల్‌హాసన్‌ తన సొంత సంస్థ రాజ్‌కమల్‌ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి రాజేష్‌. ఎం. సెల్వన్‌ దర్శకత్వం వహించబోతున్నారు. ఈ సినిమా చిత్రీకరణ మొత్తం న్యూజిలాండ్‌లో జరుగనుందని తెలుస్తోంది. 
 
ఈ చిత్రంలో కమల్‌హాసన్‌ ఇద్దరు కూతుళ్ళు శృతిహాసన్‌, అక్షర హాసన్‌ ఒకే సినిమాలో కనిపించబోతున్నారు. వీరిద్దరూ సిల్వన్‌ స్క్రీన్‌ని షేర్‌ చేసుకోవడానికి రంగం సిద్ధమైందని సమాచారం. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకతను శ్రుతిహాసన్‌ సొంతం చేసుకుంటే, తమిళం, హిందీ భాషల్లో కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ అక్షర్‌ హాసన్‌ ఇంకా నిలదొక్కుకునే ప్రయత్నంలోనే ఉంది. 
 
ఇదిలా ఉంటే, శృతిహాసన్‌ ప్రస్తుతం రవితేజతో 'క్రాక్‌' చిత్రంలో నటించింది. మలినేని గోపీచంద్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్‌ అవ్వనున్నట్టు తెలుస్తోంది.