భార్యపై అనుమానం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలనుకున్నాడు.. కానీ షాక్?
భార్యపై అనుమానం పెంచుకున్న కానిస్టేబుల్‌కి అసలు విషయం తెలిసి ఖంగుతిన్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే... భార్యకు వేరొక వ్యక్తితో సంబంధం వుందని కానిస్టేబుల్‌కు అనుమానం ఏర్పడింది. అంతే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలనుకున్నాడు. కానీ ఆ ప్రయత్నంలో భార్య స్థానంలో ఆమె సోదరి వేరొక వ్యక్తితో గదిలో వుండటాన్ని చూసి షాకయ్యాడు. ఈ ఘటన కృష్ణాజిల్లాలోని మైలవరంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మైలవరంలో పని చేస్తున్న ఓ కానిస్టేబుల్ భార్య.. స్థానిక నాయకుడితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నట్లు సదరు భర్త అనుమానం పెంచుకున్నాడు. పొందుగల రోడ్డులో ఉన్న నాయకుడి ఇంటికి భార్య రహస్యంగా వెళ్లి కలుస్తున్నట్లు కానిస్టేబుల్ భావించాడు. దీంతో భార్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలనుకున్నాడు.
ఈ క్రమంలో నిఘా పెట్టిన కానిస్టేబుల్.. ఇద్దరు వ్యక్తులు ఇంట్లో ఉన్న సమయంలో నాయకుడి ఇంటి గడియ పెట్టాడు. ఇక పోలీసులను, మీడియాను అక్కడికి పిలిచాడు. తీరా గడియ తీసేసరికి.. లోపల్నుంచి భార్య స్థానంలో ఆమె అక్క వచ్చింది. దీంతో అందరూ షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు కాలేదు.