గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 7 జులై 2020 (12:28 IST)

బాలయ్య నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి ఇంట్రస్టిగ్ అప్‌డేట్

నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్నారు. సింహా, లెజెండ్ సినిమాల తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా రూపొందుతోందని టీజర్‌ను బట్టి తెలుస్తుంది. ఈ మూవీ తర్వాత బాలయ్య సీనియర్ డైరెక్టర్ బి.గోపాల్‌తో సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి.
 
బాలయ్య - బి.గోపాల్ కలయికలో రౌడీ ఇన్స్పెక్టర్, లారీ డ్రైవర్, సమరసింహారెడ్డి, నరసింహా నాయుడు తదితర చిత్రాలు రూపొందడం...ఈ చిత్రాలన్నీ బ్లాక్ బస్టర్స్ అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తి ఏర్పడింది.
 
బాలయ్య పుట్టినరోజు నాడు జూన్ 10న ఎనౌన్స్ మెంట్ వస్తుంది అనుకున్నారు కానీ.. రాలేదు. దీంతో అసలు ఈ ప్రాజెక్ట్ ఉందా లేదా అని వార్తలు వస్తున్నాయి.
 
తాజా వార్త ఏంటంటే... బి.గోపాల్ చెప్పిన కథ బాలయ్యను పూర్తి స్ధాయిలో మెప్పించలేదట. ఈలోపు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. బాలయ్య కోసం కథ రెడీ చేసారని.. ఇటీవల ఫోన్ లో బాలయ్యకు కథ చెప్పారని.. కథ విని బాలయ్య ఓకే చెప్పారని తెలిసింది. అందుచేత బోయపాటితో బాలయ్య చేస్తున్న సినిమా తర్వాత పూరి జగన్నాథ్‌తో బాలయ్య సినిమా చేయనున్నారని టాక్.
 
గతంలో బాలయ్య, పూరి కలిసి పైసా వసూల్ సినిమా చేసారు. కమర్షియల్‌గా బిగ్ సక్సెస్ సాధించకపోయినా.. ఫ్యాన్స్‌ని మాత్రం బాగా ఆకట్టుకుంది. మరి.. పూరి ఈసారి బాలయ్యను ఎలా చూపిస్తారో.. ఏ స్ధాయి విజయాన్ని సాధిస్తారో చూడాలి.