శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 4 జులై 2020 (20:02 IST)

నేను ప్రేమలో ఉన్నా, ప్రేమిస్తూనే ఉంటా - రఘురామక్రిష్ణమరాజు

వైసిపి ఎంపి రఘురామక్రిష్ణమరాజు వ్యవహారం రోజుకు ఏ విధంగా మలుపు తిరుగుతుందో చెప్పనవసరం లేదు. పార్టీని వీడనని.. ఇదంతా తనపై జరుగుతున్న దుష్ప్రచారమని.. కావాలనే కొంతమంది పనిగట్టుకుని బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని..ఇలా చెప్పినమాటలనే పదేపదే చెబుతున్నారు రఘురామక్రిష్ణమరాజు.
 
సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఇష్టానుసారం విమర్సలు చేస్తున్నా ఆయన ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. జగన్మోహన్ రెడ్డిపై ఇంకా తనకు ప్రేమ ఉందని, మా పార్టీ అధ్యక్షుడిని ప్రేమిస్తూనే ఉంటానని చెబుతున్నాడు రఘురామక్రిష్ణమరాజు. 
 
అయితే పార్టీలో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ నిన్న ఢిల్లీలో లోక్‌సభ స్పీకర్‌కు వైసిపి ఎంపిలు ఫిర్యాదు కూడా చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించిన రఘురామక్రిష్ణమరాజు. తాను ఏం మాట్లాడకున్నా తన వీడియోలను మార్ఫింగ్ చేసి పెట్టారన్నారు.
 
తన వెనుక అస్సలు ఎవ్వరూ లేరని, బిజెపి నేతలను విమర్సించడానికి భయపడి..చంద్రబాబునాయుడు తన వెనుక నుండి నడిపిస్తున్నారంటూ విమర్సలు చేస్తున్నారని.. ఇందులో ఏమాత్రం నిజం లేదంటున్నారు రఘురామక్రిష్ణమరాజు. వైసిపి ఎంపి రోజుకో విధంగా వ్యాఖ్యలు చేస్తూ పార్టీని ఇరుకున పెట్టే విధంగా వ్యవహరిస్తుండడం ప్రస్తుతం రాజకీయ చర్చకు దారితీస్తోంది.