కొత్త జిల్లాకు అల్లూరి పేరు పెట్టాలి: జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ
అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌కు ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణ రాజు ఓ లేఖ పంపారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాకు అల్లూరి సీతారామరాజు జిల్లాగా పేరు పెట్టాలని కోరారు. ఈ మేరకు జగన్‌కు ఆయన రెండు రోజుల క్రితం రాసిన లేఖను ఆయన క్యారాలయం ఈ రోజు విడుదల చేసింది.
గత అసెంబ్లీ ఎన్నికల ముందు పాదయాత్ర చేసిన జగన్ ఆ సమయంలో ఈ విషయంపై ప్రజలకు హామీ ఇచ్చారని రఘురామకృష్ణరాజు తెలిపారు. ఇచ్చిన హామీ ప్రకారం ఈ విషయంపై ఇప్పుడు సీఎం జగన్ అధికారికంగా ప్రకటన చేయాలని ఆయన కోరారు. కొత్త జిల్లాకు ఆ పేరు పెడితే ప్రజలు సంతోషపడతారని చెప్పారు.