సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 29 జూన్ 2020 (13:31 IST)

నాకు షోకాజ్ నోటీసు పంపించడానికి విజయసాయి రెడ్డి ఎవరు? వైకాపా ఎంపీ

గత కొంతకాలంగా అధిష్టానంపై విమర్శలు చేస్తున్న వెస్ట్ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీ కె.రఘురామకృష్ణంరాజు సోమవారం వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికి ఆరు పేజీలతో కూడిన లేఖ పంపించారు. ఇందులో అసలు విజయసాయిరెడ్డి ఎవరు అంటూ నిలదీశారు. తనకు లేఖ పంపడానికి విజయసాయి రెడ్డి ఎవరు అని నిలదీశారు. 
 
ఏపీ సీఎం జగన్‌కు వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు మొత్తం 6 పేజీల లేఖను పంపారు. ఈ మధ్య విజయసాయిరెడ్డి నుంచి నోటీసు అందిందని, ఆయన లేఖకు స్పందిస్తూ రిప్లై ఇస్తున్నట్లు రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. సీ ఓటర్‌ సర్వేలో 4వ స్థానం వచ్చినందుకు జగన్‌కు అభినందనలు తెలిపారు. త్వరలో మొదటి స్థానం సాధించాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు. 
 
అలాగే తనకు లేఖ పంపించడానికి విజయసాయిరెడ్డి  ఎవరంటూ నిలదీశారు. రిజిస్టరయిన పార్టీ పేరుతో కాకుండా మరో పార్టీ లెటర్‌ హెడ్‌తో నోటీసు అందిందని తెలిపారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అనే పేరును వాడుకోవద్దని ఈసీ చెప్పిందని.. పలు సందర్భాల్లో ఈసీ మన పార్టీకి రాసిన లేఖలు దీన్ని స్పష్టం చేస్తున్నాయని గుర్తుచేశారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పేరును ఏ సందర్భంలోనూ వాడుకునే అవకాశం లేదని ఈసీ తేల్చి చెప్పిందని రఘురామకృష్ణరాజు వెల్లడించారు.