శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 19 డిశెంబరు 2014 (10:14 IST)

సింగపూర్‌లో భారతీయుడికి 9 నెలల జైలుశిక్ష... ఎందుకంటే...!!

భారత్‌కు చెందిన కామాంధులు.. స్వదేశంలోనే కాకుండా, విదేశాల్లో కూడా రెచ్చిపోతున్నారు. ఫలితంగా బాధిత మహిళల చేతిలో చెప్పుదెబ్బలు తింటూ.. జైలుపాలవుతున్నారు. తాజాగా సింగపూర్‌లో ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన భారతీయుడికి ఆ దేశ కోర్టు 9 నెలల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే... 
 
గత నవంబర్ 7వ తేదీన ఓ అపార్ట్‌మెంట్‌లోని లిఫ్ట్‌లో తనతో ప్రయాణిస్తున్న మహిళ పట్ల సత్తయ్య అనే భారతీయుడు అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె లిఫ్ట్లో నుంచి బయటకు వచ్చి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు సత్తయ్యను అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. 
 
ఈ కేసులో వాదోపవాదాలు విన్న కోర్టు నిందితుడు సత్తయ్య ఇళయరాజాకు 9 నెలల జైలు శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వేలువరించినట్టు శుక్రవారం స్ట్రెయిట్స్ టైమ్స్ అనే పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది.