సోమవారం, 30 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : మంగళవారం, 19 డిశెంబరు 2017 (08:30 IST)

ఈ రోజు దినఫలాలు... వైద్య - ఇంజనీరింగ్ కోర్సుల్లో అవకాశాలు..

మేషం : ఉమ్మడి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. రవాణా ద్వారా ఊహించని లాభాలను పొందుతారు. ఆర్థిక విషయాల్లో సంతృప్తి. దైవదర్శనాలు, మొక్కుబడులు చెల్లిస్తారు. విద్యార్ధులకు ఇంజనీరింగ్, మెడికల్ కోర్సులలో అవకా

మేషం : ఉమ్మడి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. రవాణా ద్వారా ఊహించని లాభాలను పొందుతారు. ఆర్థిక విషయాల్లో సంతృప్తి. దైవదర్శనాలు, మొక్కుబడులు చెల్లిస్తారు. విద్యార్ధులకు ఇంజనీరింగ్, మెడికల్ కోర్సులలో అవకాశాలు లభిస్తాయి. కార్యసాధనలో అనుకూలత. ప్రేమికుల మధ్య మనస్పర్ధలు తలెత్తుతాయి.
 
వృషభం : ఫ్లీడర్లకు ఫ్లీడర్లకు గుమస్తాలకు క్లయింట్స్‌తో చికాకులు తప్పవు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అందివస్తాయి. బంధు, మిత్రుల కలయిక సంతృప్తినిస్తుంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. వ్యవసాయ రంగాల వారికి ఆశాజనకం. క్రయ విక్రయాలు సామాన్యం.
 
మిథునం : ముఖ్యమైన విషయాలను మీ శ్రీమతికి తెలియజేయటం మంచిది. ఒక స్థిరాస్తి విక్రయానికి అడ్డంకులు తొలగిపోగలవు. తొందరపాటు చర్యల వల్ల నష్టాలు, ఇబ్బందులెదుర్కుంటారు. ఇతరుల గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతాయి. ఏ వ్యక్తినీ తక్కువ అంచనా వేయటం మంచిది కాదు.
 
కర్కాటకం : పాత మిత్రుల కలయిక సంతోషం కలిగిస్తుంది. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు ఫలిస్తాయి. నూతన పెట్టుబడులు, లీజు, ఏజెన్సీలు, టెండర్ల వ్యవహారాల్లో మెలకువ వహించండి. వృత్తుల వారికి పేరు ప్రఖ్యాతలు, శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తాయి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.
 
సింహం : బ్యాంకు పనుల్లో ఒత్తిడి, జాప్యం ఎదుర్కుంటారు. ఆస్తి పంపకాలు, స్థల వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆదాయ వ్యయాలు మీ బడ్జెట్‌కు భిన్నంగా ఉంటాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. వాణిజ్య ఒప్పందాలు, భాగస్వామిక వ్యవహారాల పట్ల దృష్టి సారిస్తారు.
 
కన్య : స్త్రీలకు టి.వీ ఛానెళ్ల నుంచి ఆహ్వానం, ధనప్రాప్తి, వస్తు లాభం వంటి ఫలితాలున్నాయి. విదేశాల్లోని ఆత్మీయులకు ప్రియమైన వస్తుసామగ్రి అందిస్తారు. ఇతరులతో సంభాషించేటపుడు ముందు వెనుకలు చూసుకోవటం మంచిది. మీ యత్నాలు ఫలించటంతో పాటు కొన్ని అవకాశాలు కలిసివస్తాయి.
 
తుల : వ్యాపారాల్లో ఆటుపోట్లను తట్టుకుంటారు. పత్రికా సంస్థలలోని వారికి కీలకమైన వార్తల ప్రచురణలో ఇబ్బందులెదుర్కోవలసి వస్తుంది. విద్యార్ధుల అత్యుత్సాహం అనర్ధాలకు దారితీసే ఆస్కారం ఉంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలిస్తాయి. సేవ, పుణ్య కార్యాల్లో పాల్గొంటారు.
 
వృశ్చికం : వృత్తి వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. మీ అభిప్రాయాలు, నిర్ణయాలను సూటిగా వ్యక్తం చేయండి. కుటుంబీకుల మధ్య బంధువుల ప్రస్తావన వస్తుంది. ఇంజనీరింగ్, మెడికల్ విద్యార్ధినులు మంచి ఫలితాలు సాధిస్తారు. వాహన చోదకులకు ఆటుపోట్లు తప్పవు. స్త్రీలకు పనివారతో ఇబ్బందులు తప్పవు.
 
ధనస్సు : విత్తన కొనుగోళ్లు, వ్యవసాయ కూలీలతో చికాకులు తప్పవు. స్త్రీల ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలిస్తాయి. ధనవ్యయంతో కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారుల ఒత్తిడి అధికం.
 
మకరం : ఆర్థిక లావేదేవీలు, ఉమ్మడి వ్యవహారాలు సమర్ధంగా నిర్వహిస్తారు. సంఘంలో మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన వ్యక్తులతో సంబంధాలు నెలకొంటాయి. ఆకస్మికంగా ఎదురైన సమస్యల పట్ల దీటుగా స్పందిస్తారు. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు అభ్యంతరాలు, కొత్త సమస్యలు ఎదురవుతాయి.
 
కుంభం : అకాల భోజనం, శారీరక శ్రమ వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. వృత్తుల వారికి మంచి గుర్తింపు, శ్రమకు తగిన ఆదాయం లభిస్తాయి. కోర్టు తీర్పులు, పెద్దల నిర్ణయం మీకు అనుకూలంగానే ఉంటాయి. మీ ప్రత్యర్ధుల విషయంలో జాగ్రత్త వహించండి. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకం.
 
మీనం : కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లుల వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ఉద్యోగస్తుల పనితీరు, సమర్ధతలు అధికారులను ఆకట్టుకుంటాయి. ఏ యత్నం ఫలించక నిరుద్యోగులు నిరుత్సాహానికి లోనవుతారు. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించటం మంచిది కాదని గమనించండి.