సోమవారం, 30 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By pnr
Last Updated : సోమవారం, 18 డిశెంబరు 2017 (06:50 IST)

నేటి దినఫలితాలు : స్త్రీలకు వ్యాపకాలు పెరుగుతాయి

మేషం : మార్కెట్ రంగాల వారికి, ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. మీ సంతానానికి దూర ప్రాంతాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్త

మేషం : మార్కెట్ రంగాల వారికి, ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. మీ సంతానానికి దూర ప్రాంతాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. మీ మాటలను కొంత మంది వక్రీకరించే ఆస్కారం ఉంది.
 
వృషభం : వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ప్రైవేట్ సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం ముఖ్యం. ధనవ్యయంతో కొన్ని పనులు సానుకూలమవుతాయి. స్త్రీలకు ఆర్జన పట్ల ఆసక్తితో పాటు ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులెదుర్కుంటారు.
 
మిథునం : భాగస్వామిక ఒప్పందాల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. వ్యవసాయ రంగాల వారు అనుభవజ్ఞుల సలహాలు పాటించటం శ్రేయస్కరం. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లు రాణిస్తారు. రిటైర్డు ఉద్యోగస్తులకు రావలసిన బెనఫిట్స్ కోసం బాగా శ్రమించాలి. సన్నిహితుల ద్వారా ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు.
 
కర్కాటకం : సేవ, పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. అప్రయత్నంగా కొన్ని అవకాశాలు కలిసివస్తాయి. ఎంతో కొంత పొదుపు చేద్దామన్న మీ ఆలోచన ఫలించకపోవచ్చు. ఓర్పు, పట్టుదలతో శ్రమించి కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. గృహ నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. ఉపాధ్యాయులకు పనిభారం అధికం.
 
సింహం : భూసంబంధిత క్రయ విక్రయాలు ఒక కొలిక్కి వచ్చే సూచనలున్నాయి. ప్రయాణాలు, బ్యాంకు పనుల్లో మెలకువ వహించండి. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు యధావిధిగా సాగుతాయి. వ్యాపారాల్లో ఒక నష్టాన్ని మరొక విధంగా పూడ్చుకుంటారు. మీ నిజాయితీ, చిత్తశుద్ధి ప్రముఖులను ఆకట్టుకంటాయి.
 
కన్య : విద్యార్ధులు కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. రాజకీయ నాయకులు సభ సమావేశాలలో పాల్గొంటారు. కొన్ని విషయాలు చూసీచూడనట్లుగా వదిలేయటం మంచిది. స్త్రీలు భేషజాలకు పోకుండా పరిస్థితులకు అనుగుణంగా మెలగాలి. రుణాలు తీరుస్తారు.
 
తుల : ఆర్థికంగా నిలదొక్కుకోవటంతో పాటు రుణాలు తీరుస్తారు. ట్రాన్స్‌పోర్టు రంగాల్లో వారికి కార్మికుల వల్ల సమస్యలు తలెత్తుతాయి. ఫ్లీడరు నోటీసులు, ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. మనోధైర్యంతో అడుగు ముందుకేయండి. హామీలు ఉండటం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు.
 
వృశ్చికం : గృహమునకు కావలసిన వస్తువులు అమర్చుకోగలుగుతారు. రైతులకు వాతావరణంలో మార్పు చికాకు కలిగిస్తుంది. ఆడిటర్లకు సంతృప్తి కానరాగలదు. ఉద్యోగస్తులకు పై అధికారుల వలన ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ముఖ్యులను కలుసుకుంటారు. స్త్రీలకు పనివారితో ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
ధనస్సు : బ్యాంకింగ్ రంగాల వారికి చికాకులు తప్పవు. ప్రైవేటు సంస్థల్లోని వారు మార్పులకై చేయు ప్రయత్నాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ సంతానంపై ప్రేమా, వాత్సల్యాలు పెంపొందుతాయి. రాజకీయంలో వారికి కార్యకర్తల వల్ల చికాకులు తప్పవు. స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి.
 
మకరం : నిరుద్యోగ, వివాహ యత్నాలు ఫలిస్తాయి. సొంతంగా వ్యాపారం చేయాలన్న మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. పాతమొండి బాకీలు వసూలు అవుతాయి. లీజు, ఏజెన్సీ, నూతన కాంట్రాక్టులు అనుకూలిస్తాయి. పెద్దల ఆరోగ్యం కోసం ధనం విరివిగా వ్యయమవుతుంది. ప్రేమికుల మధ్య అపార్ధాలు తొలగిపోతాయి.
 
కుంభం : ధనాభివృద్ధి కానవచ్చినా ధనం ఏమాత్రం నిల్వ చేయలేకపోవడం వల్ల ఆందోళనకు గురవుతారు. రిప్రజెంటివ్‌లకు నెమ్మదిగా మార్పులు కానరాగలవు. చిన్న చిన్న విషయాలలో మానసిక ఆందోళనకు గురవుతారు. సభలు, సమావేశాల్లో ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
మీనం : విద్యార్ధులకు దూర ప్రాంతాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానియ వ్యాపారులకు కలసిరాగలదు. మత్స్య, కోళ్ల, గొఱ్ఱెల వ్యాపారస్తులు మెలకువ వహించండి. దుబారా ఖర్చులు అధికమవుతాయి.