గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Raman
Last Modified: శనివారం, 22 జులై 2017 (21:58 IST)

రాశి ఫలితాలు(23-07-2017)... ఇలా వున్నాయి...(వార ఫలితాలు-వీడియో)

మేషం : రాజకీయాలలోని వారికి ఒక సమాచారం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. సహోద్యోగులతో కళా, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దంపతుల మధ్య పరస్పర అవగాహనా లోపం. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిదికాదు. రేషన్ డీలర్లకు అధికారుల నుంచి వేధింపులు ఎదుర్కొంటారు.

మేషం : రాజకీయాలలోని వారికి ఒక సమాచారం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. సహోద్యోగులతో కళా, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దంపతుల మధ్య పరస్పర అవగాహనా లోపం. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిదికాదు. రేషన్ డీలర్లకు అధికారుల నుంచి వేధింపులు ఎదుర్కొంటారు.  
 
వృషభం : పాత మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. రవాణా రంగాల వారికి మెళకువ, ఏకాగ్రత అవసరం. హోటల్, తినుబండార వ్యాపారస్తులకు సంతృప్తి కానవస్తుంది. మీ పరోపకార బుద్ధి మీకు సమస్యలను తెచ్చిపెడుతుంది. పెద్దల ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. విద్యార్థులు క్రీడా కార్యక్రమాలలో పాల్గొంటారు. 
 
మిథునం : మీ మంచితనమే మీకు శ్రీరామరక్ష. గృహ నిర్మాణానికి సంబంధించిన చర్చలు ఫలిస్తాయి. సోదరుని వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. మీ పరోపకారబుద్ధి  మీకు సమస్యలను తెచ్చిపెడుతుంది. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. 
 
కర్కాటకం : సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. భక్తి, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. రాజకీయాలలో వారికి విదేశీ పర్యటనలు అధికమవుతాయి. ఆందోళనలు కలిగించిన సంఘటన తేలికగా సమసిపోతుంది. రుణయత్నం ఫలించి ధనం చేతికి అందుతుంది. 
 
సింహం : మీ సంతానంతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో స్వల్ప ఒడిదుడుకులు, చికాకులు ఎదుర్కొంటారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం నిరీక్షణ తప్పదు. వాయిదా పడిన మొక్కుబడులు తీర్చుకుంటారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. బంధువుల ఆకస్మిక రాకవల్ల ఖర్చులు అధికమవుతాయి. 
 
కన్య : కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. పెద్దమొత్తం ధన సహాయం క్షేమం కాదు. ఉద్యోగంలో శ్రమకు నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. కోళ్ళ, మత్స్యు, పాడి పరిశ్రమ, గొర్రెల రంగాల్లో వారికి అనుకున్నంత సంతృప్తికానరాదు. మీ జీవిత భాగస్వామితో సఖ్యత నెలకొంటుంది. 
 
తుల : వృత్తుల వారికి శ్రమాధిక్యత మినహా ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. స్త్రీల ప్రతిభకు గుర్తింపు, అవకాశాలు లభిస్తాయి. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఖర్చులు అదుపు చేయాలనే మీ సంకల్పం నెరవేరుతుంది. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. 
 
వృశ్చికం : చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. కుటుంబసభ్యుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. స్త్రీలకు కొత్తకొత్త కోరికలు, సరదాలు స్ఫురిస్తాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. దైవ కార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. 
 
ధనస్సు : మత్స్యు కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు విశ్రాంతి లభిస్తుంది. రాజకీయనాయకులకు ప్రయాణాలలో ఇబ్బందులు తప్పవు. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. దైవసేవా కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరిస్తారు. 
 
మకరం : కొన్ని విషయాలను చూసీచూడనట్టుగా ఉండాలి. సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. సన్నిహితుల కోసం ధనం విరివిగా వ్యయం చేయవలసి వస్తుంది. శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదాపడతాయి. 
 
కుంభం : ఉమ్మడి వెంచర్లు, పెట్టుబడుల వ్యవహారంలో అనుభవజ్ఞుల సలహా పాటించండి. స్త్రీలు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల భంగపాటుకు గురవుతారు. పండ్లు, పూలు, కొబ్బరి, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. 
 
మీనం : బంధువుల రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి. మిత్రులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులు బోగస్ ప్రకటనల వల్ల నష్టపోయే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. రహస్య విరోధులు అధికం కావడం వల్ల రాజకీయాలో వారికి ఆందోళన తప్పదు. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు.

వార ఫలితాల కోసం ఈ వీడియో చూడండి...