బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By chj
Last Modified: బుధవారం, 19 సెప్టెంబరు 2018 (15:26 IST)

మంచం మీద కూర్చుని భోజనం చేస్తే వచ్చే ఫలితాలు తెలిస్తే షాకే..?

మంచం మీద కూర్చుని భోజనం చేయకూడదంటున్నారు జ్యోతిష్య నిపుణులు. కొంతమంది టీవీ చూస్తూ తింటారు. కొంతమంది మంచం మీద కూర్చుని తింటారు. శక్తి కోసం భోజనం చేసి తీరాలి. కానీ భోజనం చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని జ్యోతిష్య నిపుణులు చెబుతారు.

మంచం మీద పిల్లలకు తినిపిస్తుంటారు. పిల్లలు కాని, పెద్దలు కాని మంచం మీద కూర్చుని భోజనం తింటే... తిన్న తిండి మంచం కోళ్ళకు పడుతుందని మన పెద్దలు చెబుతుంటారు. అంటే తిన్నందు వల్ల వచ్చే శక్తి ఒంటికి అతకదని దాని అర్థం.
 
భోజనం మంచం మీద తింటే అది రోగాలకు కారణమవుతుందట. అంతేకాదు భార్యాభర్తల మధ్య గొడవలకు దారితీస్తుందట. కుటుంబంలో మనశ్శాంతి పూర్తిగా కరవవుతుందట. భోజనం చేసేటప్పుడు దేవుడిని ప్రార్థించాలట. మన దేహం దేవాలయం. మన ఆత్మ భగవత్ స్వరూపం అని భావిస్తున్నాం కాబట్టి. ఆ దేహానికి శాంతి చేకూరడానికి తినేటప్పుడు ఖచ్చితంగా ఒక పద్ధతిలో భోజనం చేయాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.