శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pnr
Last Updated : మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (14:25 IST)

మాంసం ఆరగించి ఆలయాలకు ఎందుకు వెళ్లరాదు?

పెద్దల మాట.. చద్దనం మూట అన్నది పెద్దల మాట. అయితే అవన్నీ అప్పటి కాలానికి నీతులని, ఇప్పటి కాలంలో కూడా వాటినే పట్టుకుని ఎందుకు వేలాడతారని ప్రశ్నించే వారు కూడా ఉన్నారు. కానీ ఎక్కువ మంది కొన్ని విషయాలలో పె

పెద్దల మాట.. చద్దనం మూట అన్నది పెద్దల మాట. అయితే అవన్నీ అప్పటి కాలానికి నీతులని, ఇప్పటి కాలంలో కూడా వాటినే పట్టుకుని ఎందుకు వేలాడతారని ప్రశ్నించే వారు కూడా ఉన్నారు. కానీ ఎక్కువ మంది కొన్ని విషయాలలో పెద్దల చెప్పిన మాటలను ఇప్పటికీ పాటిస్తున్నారు.
 
మాంసాహారం తిన్న రోజు ఆలయాలకు వెళ్లకపోవడం కూడా అలాంటి వాటిలో ఒకటి. ఇప్పటికీ చాలామంది ఆలయాలకు వెళ్లాలనుకున్న రోజు మాంసాహారానికి దూరంగా ఉంటారు. అయితే దీని వెనుక బలమైన కారణం లేకపోలేదని పెద్దలు చెబుతుంటారు. 
 
మాంసాన్ని ఆరగించడం వల్ల బుద్ధి మందగిస్తుంది. దీంతో కామక్రోధాలపై వ్యామోహం పెరుగుతుంది. ఆధ్యాత్మికపై మనసు లగ్నం చేయలేరు. అందుకే మాంసాన్ని ఆలయానికి వెళ్లే ముందు తినొద్దని చెబుతారు. అయితే కొన్ని ఆలయాల్లో మాత్రం ఈ పట్టింపు లేదు. కొన్ని అమ్మవారి ఆలయాలకు మాంసాహారం తిన్నా కూడా వెళ్లొచ్చు.