శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 17 సెప్టెంబరు 2018 (13:34 IST)

అమృతసర్‌‌కు విఘ్నేష్‌తో వెళ్లిన నయనతార.. త్వరలో పెళ్లి?

దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతార త్వరలో పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు కోలీవుడ్‌లో మళ్లీ గుప్పుమన్నాయి. కొంతకాలంగా దర్శకుడు, నటుడు విఘ్నేష్ శివన్‌తో నయన ప్రేమలో ఉన్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసింద

దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతార త్వరలో పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు కోలీవుడ్‌లో మళ్లీ గుప్పుమన్నాయి. కొంతకాలంగా దర్శకుడు, నటుడు విఘ్నేష్ శివన్‌తో నయన ప్రేమలో ఉన్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలను నిజం చేసేలా నయన, విఘ్నేష్ జంట ఫారిన్ ట్రిప్పులేసింది. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అయిన సంగతి తెలిసిందే. 
 
మొన్నటి మొన్న అమెరికాలో సందడి చేసిన ఈ జంట తాజాగా గోల్డెన్ టెంపుల్‌లో కనిపించారు. నయనతార తరచూ అమృత్‌సర్‌కు ఒంటరిగా వెళ్లొచ్చేది, కానీ ఈసారి మాత్రం విఘ్నేష్‌ని వెంటబెట్టుకొని వెళ్లడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్ గా మారింది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం నయనతార.. అజిత్ హీరోగా 'విశ్వాసం' సినిమాలో నటిస్తోంది. తెలుగులో మెగాస్టార్ సరసన 'సైరా నరసింహారెడ్డి' సినిమాలో హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ రెండు సినిమాలతో పాటు ఆమె చేతిలో మరో రెండు తమిళ సినిమాలు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రియుడితో కలిసి అమృతసర్‌లో కనిపించిన నయనతార చేతిలో వున్న సినిమాలు పూర్తయ్యాక పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.