శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (20:42 IST)

అటు గరుడ సేవ... నీతో నేను ఏకాంత సేవ... వివాహితకు వేధింపులు

చిత్తూరు జిల్లాలో ఒక కామ పోలీస్ నిర్వాకం బయటపడింది. భార్యాభర్తల మధ్య గొడవ విషయంలో సిఐను కలిసేందుకు వచ్చిన మహిళను వేధింపులకు గురిచేశాడు ఆ పోలీసు అధికారి. న్యాయం చేస్తానని, అయితే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ రోజు తనను తిరుమలలో కలిసేందుకు రా

చిత్తూరు జిల్లాలో ఒక కామ పోలీస్ నిర్వాకం బయటపడింది. భార్యాభర్తల మధ్య గొడవ విషయంలో సిఐను కలిసేందుకు వచ్చిన మహిళను వేధింపులకు గురిచేశాడు ఆ పోలీసు అధికారి. న్యాయం చేస్తానని, అయితే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ రోజు తనను తిరుమలలో కలిసేందుకు రావాలన్నాడు సిఐ.
 
తిరుమలలో ఏకాంతంగా గడుపుతామని వేధింపులకు గురిచేశాడు. వాట్సాప్‌లో చాటింగ్ చేస్తూ ఆమెను మానసికంగా ఇబ్బందులకు గురి చేశాడు. దీంతో తిరుమలకు వచ్చింది బాధితురాలు. మీడియాను ఆశ్రయించింది. సిఐ నిర్వాకాన్ని మీడియా ముందుంచింది మహిళ సంయుక్త.