మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (13:01 IST)

ఇంతకాలం నేను మౌనంగా వుండి తప్పు చేశా... ట్విట్టర్లో గీతగోవిందం హీరోయిన్

రష్మిక మందన్న, రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం అయిన తరువాత ఈ భామ వరుస హిట్లతో అందరి మనసును దోచుకున్నది. అంతేకాకుండా అటు కన్నడ, ఇటు తెలుగు చిత్ర పరిశ్రమల్లో డిమాండున్న హీరోయిన్ కూడా రష్మికే. అయితే తనపై వ

రష్మిక మందన్న, రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం అయిన తరువాత ఈ భామ వరుస హిట్లతో అందరి మనసును దోచుకున్నది. అంతేకాకుండా అటు కన్నడ, ఇటు తెలుగు చిత్ర పరిశ్రమల్లో డిమాండున్న హీరోయిన్ కూడా రష్మికే. అయితే తనపై వస్తున్న విమర్శలపై మెుదటిసారిగా రష్మిక వివరణ ఇచ్చింది. రక్షిత్‌తో నిశ్చితార్థం క్యాన్సిల్ అయిందనే విషయంపై ఇంతకాలం నేను మౌనంగా ఉండి తప్పు చేశానని రష్మిక ట్విట్టర్‌లో చెప్పింది.
 
అలానే తనపై వస్తున్న వార్తలపై ట్రోల్స్ అన్నీ చూస్తునే ఉన్నానని చెప్పుకొచ్చింది ఈ భామ. బయట తనను ఎవరు ఎలా చూస్తున్నారన్న విషయాన్ని అనుకుంటేనే బాధగా ఉంటుందని ఇలాంటి విషయాలకు నేను ఎవరిని నిందించాలనుకోలేదని చెప్పింది. 
 
బయటి ప్రజలు తన గురించి చెప్పే విషయాలు నిజం కాదని చెప్పేందుకు నా తరఫున ఎవరురాలేదని బాధపడింది. ప్రతి నాణానికి బొమ్మ, బొరుసు ఉన్నట్లే ప్రతి కథకూ రెండు కారణాలుంటాయని చెప్పుతూ నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండని వేడుకుంది.