బుధవారం, 1 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Raman
Last Updated : గురువారం, 4 అక్టోబరు 2018 (10:13 IST)

04-10-2018 - గురువారం మీ రాశిఫలితాలు.. మీ కష్టాన్ని, ఆందోళనను గుర్తిస్తారు...

మేషం: మీరెదుర్కున్న సమస్య బంధువులకు ఎదురవడంతో మీ కష్టాన్ని, ఆందోళనను గుర్తిస్తారు. రహస్య విరోధులు అధికం కావడం వలన రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సం

మేషం: మీరెదుర్కున్న సమస్య బంధువులకు ఎదురవడంతో మీ కష్టాన్ని, ఆందోళనను గుర్తిస్తారు. రహస్య విరోధులు అధికం కావడం వలన రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి.
 
వృషభం: డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. మీ శ్రీమతికి మీరంచే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. ప్రింటింగ్ రంగాల వారికి బాకీలు వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు వంటివి తప్పవు. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వడం మంచిది కాదు. కొన్ని సమస్యలు చిన్నవే అయిన మనశ్శాంతి దూరంచేస్తారు.  
 
మిధునం: వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండడం శ్రేయస్కరం. కోర్టు వ్యవహారాలు విచారణకు వస్తాయి. మీ అంచనాలు, పథకాలు బెడిసికొట్టే ఆస్కారం ఉంది. ఇంజనీరింగ్ విద్యార్థులకు క్యాంపస్ సెలక్షన్లు నిరుత్సాహం కలిగిస్తాయి. దంపతుల మధ్య కలహాలు, చికాకులు చోటు చేసుకుంటాయి.  
 
కర్కాటకం: ఉద్యోగస్తుల ప్రమోషన్‌కు కొంతమంది అడ్డుతగులుతారు. పారిశ్రామిక వేత్తలు, కాంట్రాక్టర్లకు అధికారుల నుండి అభ్యంతారాలెదుర్కోవలసి వస్తుంది. శుభకార్యాలు, స్థిరాస్తుల కొనుగోళ్ళపై దృష్టి సారిస్తారు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు.  
 
సింహం: విద్యార్థులకు నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికమవుతాయ. ఒక ప్రకటన మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. రాబోయే ఆదాయానికి తగినట్టుగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. సోదరీసోదరులు బంధువుల మధ్య బాంధవ్యాలు మరింత బలపడుతాయి.  
 
కన్య: ఉద్యోగస్తుల సమర్థ, పనితీరు అధికారులను ఆకట్టుకుంటాయి. మీ కుటుంబానికి మీరు అవసరం కను వ్యసనాలకు దూరంగా ఉండండి. ప్రేమికుల ఆలోచనలు పెడదారి పట్టే ఆస్కారం ఉంది. గృహంలో వస్తువు పోవడానికి అవకాసం ఉంది జాగ్రత్త వహించండి. సాహిత్యభిలాష పెరుగుతుంది. 
 
తుల: ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించి మీ పనులు సానుకూలమవుతాయి. స్త్రీలు పనివారలతో చికాకులు ఎదుర్కుంటారు. లీజు, ఏజెన్సీలు, నూతన కాంట్రాక్టులు అనుకూలిస్తాయి. మీ కందిన చెక్కులు చెల్లక ఇబ్బందులు ఎదుర్కుంటారు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి స్పందన లభిస్తుంది.   
 
వృశ్చికం: ఆర్థిక ఇబ్బంది అంటూ ఉండదు. రచయితలకు, పత్రికా రంగాలలో వారికి ప్రోత్సాహం కానవస్తుంది. తల్లి, తండ్రి ఆరోగ్యం గురించి ఆందోళన అధికమవుతుంది. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించడం మంచిది కాదని గమనించండి. పాత వస్తువులను కొని ఇబ్బందులు తెచ్చుకోకండి.  
 
ధనస్సు: మీ సంతానం గురించి ఆందోళన చెందుతారు. గృహంలో మార్పులు, చేర్పులు చేస్తారు. నూతన పెట్టుబడులకు ఇది సరియైన సమయమని గమనించండి. దూర ప్రయాణాల్లో అసౌకర్యానికి గురవుతారు. విద్యార్థులలో కొత్త ఉత్సాహం చోటు చేసుకుంటుంది. ఖర్చులు, చెల్లింపులు ఆందోళన కలిగిస్తాయి. 
 
మకరం: భాగస్వామిక, సొంత వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచడం మంచిది. సన్నిహితుల ద్వారా కొత్త విషయాలు గ్రహిస్తారు. ఉన్నతాధికారులు ధనప్రలోభాలకు దూరంగా ఉండడం మంచిది. వృత్తుల వారికి సామాన్యం. ఏజెంట్లు, బ్రోకర్లకు ఒత్తిడి, పనిభారం అధికం. 
 
కుంభం: పారిశ్రామిక రంగాలవారు ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. దేవాలయ, విద్యా సంస్థలకు దానధర్మాలు చేయుటవలన మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. బంధువుల రాకపోకలు సంతోషాన్ని కలిగిస్తాయి. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఒత్తిడి, శ్రమాధిక్యత అధికమవుతుంది. మీ కోపాన్ని ఎక్కువగా ప్రదర్శించడం మంచిదికాదు.   
 
మీనం: వ్యాపారాభివృద్ధికి చేయు కృషి ఫలిస్తుంది. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. ఒక వ్యవహారం నిమిత్తం ప్లీడర్లతో సంప్రదింపులు జరుపుతారు. ఎప్పటి నుండో వాయిదాపడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభిస్తారు. పత్రికా సంస్థల్లో వారికి పనిభారం అధికం. ప్రముఖుల కలయిక సాధ్యం కాదు.