శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Raman
Last Updated : శనివారం, 29 సెప్టెంబరు 2018 (08:55 IST)

29-09-2018 - శనివారం మీ రాశి ఫలితాలు.. అసాధ్యమనుకున్న పనులు సునాయాసంగా...

మేషం: ట్రాన్స్‌పోర్ట్, ట్రావెలింగ్ రంగాలవారికి మిశ్రమ ఫలితం. నిరుద్యోగుల ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. స్త్రీలకు వస్తువుల పట్ల, దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పాత రుణాలు తీర్చ గలుగుతారు. ఉ

మేషం: ట్రాన్స్‌పోర్ట్, ట్రావెలింగ్ రంగాలవారికి మిశ్రమ ఫలితం. నిరుద్యోగుల ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. స్త్రీలకు వస్తువుల పట్ల, దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పాత రుణాలు తీర్చ గలుగుతారు. ఉద్యోగస్తులు స్థాన చలనాకికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరీసోదరులతో విబేధాలు తలెత్తుతాయి.
 
వృషభం: ముఖ్యంగా ఇతరుల వ్యాపార విషయాలలో జోక్యం అంత మంచిదికాదు అని గమనించండి. ఉద్యోగస్తులకు తలపెట్టిన పనిలో అవాంతరాలను ఎదుర్కుంటారు. బ్యాంకు పనులు చురుకుగా సాగుతాయి. ఆదాయ వ్యయాలు మీ బడ్జెట్‌కు విరుద్ధంగా ఉంటాయి. అసాధ్యమనుకున్న పనులు సునాయాసంగా పూర్తిచేస్తారు.   
 
మిధునం: ఆర్థిక ఇబ్బంది లేకపోయినా సంతృప్తి, పురోభివృద్ధి కానరాదు. పుణ్యక్షేత్రాలు దర్శనం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి చికాకు కలిగిస్తుంది. కొబ్బరి, పండ్లు, పూలు పానీయ, కూరగాయలు వ్యాపారస్తులకు పురోభివృద్ధి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.  
 
కర్కాటకం: ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. ధనం ఏ మాత్రం నిల్వ చేయలేకపోవడం వలన ఆందోళనకు గురవుతారు. పరిచయం లేని స్త్రీలతో మితంగా సంభాషించడం శ్రేయస్కరం. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది.     
 
సింహం: దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. చిరకాలపు సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావంతో పనిచేయవలసి ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు ఇబ్బందులు తప్పవు. రుణ విముక్తులు కావడంతో పాటు తాకట్టు వస్తువులను విడిపించుకుంటారు.  
 
కన్య: దేవాలయ, విద్యాసంస్థలకు దానధర్మాలు చేయడం వలన మంచి పేరు, ఖ్యాతి వస్తుంది. మీ ఆలోచనలు, పథకాలు గోప్యంగా ఉంచండి. ముఖ్యులలో ఒకరి గురించి అప్రియమైన వార్తలు వింటారు. రుణం ఏ కొంతైనా తీర్చడానికై చేయు ప్రయత్నం వాయిదా వేస్తారు. కిరాణా, ఫ్యాన్సీ, వస్త్ర, బంగారం, వెండి వ్యాపారులకు పురోభివృద్ధి.     
 
తుల: చిన్నతరహా పరిశ్రమల వారికి పురోభివృద్ధి కానవస్తుంది. ఇతరుల విషయాలకు, వాదోపవాదాలకు దూరంగా ఉండడం మంచిది. కోర్టు వ్యవహారాలు వాయిదా కోరుకోవడం మంచిది. మీ మాటలు కొంతమంది వక్రీకరించే ఆస్కారం ఉంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి.     
 
వృశ్చికం: కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. ఉద్యోగస్తులు స్థానచలన యత్నాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. విద్యార్థులకు తోటివారి కారణంగా ఇబ్బందులు ఎదురవుతాయి. శ్రీవారు, శ్రీమతికి అవసరమైన వస్తువులు సేకరిస్తారు. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన త్వరలోనే నెరవేరగలదు.  
 
ధనస్సు: స్థిరాస్తి వ్యవహారాలు, భాగస్వామిక ఒప్పందాలు ఒక కొలిక్కి రాగలవు. ప్రైవేటు సంస్థల వారికి, రిప్రజెంటేటివ్‌లకు అనాలోచిత నిర్ణయాల వలన ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. వాహనసౌఖ్యం, మానసిక ప్రశాంతత లభిస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఆశాజనకం. ధనం కంటే ఆత్మగౌరవానికే ప్రాధాన్యం ఇస్తారు.      
 
మకరం: ఉద్యోగస్తుల సమర్థత, చాకచక్యానికి అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. స్త్రీలకు చుట్టుప్రక్కల వారి నుండి గుర్తింపు లభిస్తుంది. మీ సేవలకు ప్రశంసలు అందుకుంటారు. రవాణా రంగాలవారికి ఆందోళనలు అధికమవుతాయి. దంపతుల మధ్య పలు ఆలోచనలు చోటు చేసుకుంటాయి.   
 
కుంభం: వైద్యులకు మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. సందర్భానుకూలంగా సంభాషించి సమస్యలకు దూరంగా ఉండండి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలిస్తాయి. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించడం వలన అస్వస్థతకు లోనవుతారు.  
 
మీనం: బంధువులకు ఆర్థిక సహాయం చేసే విషయంలో పునరాలోచన అవసరం. స్త్రీలకు కోరికలు, అవసరాలు నెరవేరుతాయి. వస్తువుల పట్ల ఏకాగ్రత వహిస్తారు. ఆత్మీయులకు సహాయ సహకారాలు అందిస్తారు. సోదరీసోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. పెద్దల ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు.