శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : గురువారం, 27 సెప్టెంబరు 2018 (09:31 IST)

27-09-2018 - గురువారం దినఫలాలు - కార్యసాధనకు లౌక్యంగా ...

మేషం: హోటల్, క్యాటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కుంటారు. ప్రయాణం తలపెడతారు. రాజకీయనాయకులు అపరిచిత వ్యక్తులపట్ల అప్రమత్తత అవసరం. స్త్రీలకు అయిన వారి నుండి ఆదరణ, సహాయం లభిస్తుంది. విద్యార్

మేషం: హోటల్, క్యాటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కుంటారు. ప్రయాణం తలపెడతారు. రాజకీయనాయకులు అపరిచిత వ్యక్తులపట్ల అప్రమత్తత అవసరం. స్త్రీలకు అయిన వారి నుండి ఆదరణ, సహాయం లభిస్తుంది. విద్యార్థులు ఇతరుల వాహనం నడిపి ఇబ్బందులకు గురికాకండి.
 
వృషభం: వృత్తి, ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. కార్యసాధనకు లౌక్యంగా వ్యవహరించాలి. పట్టుదలకు పోవడం క్షేమం కాదు. ఉద్యోగస్తులకు శుభవార్తా శ్రవణం. మీ విషయాల్లో ఇతరుల జోక్యం ఇబ్బంది కలిగిస్తుంది. ఆత్మీయులను కలుసుకుంటారు. రచయితలు, క్రీడా, కళాకారులకు ప్రోత్సాహకరం.  
 
మిధునం: ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ప్రైవేటు సంస్థలలోని వారి నిర్లక్ష్యం, మతిమరుపు వలన యాజమాన్యం కోపతాపాలకు గురికావలసి వస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించడం వలన అస్వస్థతకు లోనవుతారు. స్త్రీలు అపోహల వలన మాటపడక తప్పదు.    
 
కర్కాటకం: ఉద్యోగస్తులకు ఒత్తిడి, విశ్రాంతి లోపం. రుణయత్నాలు అనుకూలిస్తాయి. ఖర్చులు మీ అంచనాలకు విరుద్ధంగా ఉంటాయి. నిర్ణయాలలో పొరపాట్లు సరిదిద్దుకోవచ్చు. బ్యాంకింగ్, ఫైనాన్స్, చిట్క్ రంగాలవారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. కాంట్రాక్టర్లకు చేపట్టిన పనులు ఏమంత సంతృప్తి నివ్వజాలవు.  
 
సింహం: తలపెట్టిన పనులలో విఘ్నాలు, చీటికి మాటికి అసహానం ఎదుర్కుంటారు. కళా, క్రీడా రంగాలవారికి మంచి గుర్తింపు, ఆదరణ లభిస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలల మెళకువ అవసరం. రాజకీయాల్లో వారికి విరోధుల విషయంలో అప్రమత్తత అవసరం. మీ కళత్ర మెుండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. 
 
కన్య: కొన్ని వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తికాగలవు. సమయానికి ధనం అంది అవసరాలు తీరతాయి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. మీ సంతానం మెుండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. బంధువుల సహాయంతో ముందడుగు వేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.    
 
తుల: పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఉద్యోగాలలో అనుకోని మార్పులు సంభవిస్తాయి. కొబ్బరి, పండ్లు, పూలు చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. పారిశ్రామిక వర్గాల కృషి ఫలిస్తుంది. పెద్దల ఆరోగ్యంలో సంతృప్తి కానవస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. 
 
వృశ్చికం: అనుకోని ధనప్రాప్తి ఆదరణ పొందుతారు. ఇంటాబయట గౌరవం లభిస్తుంది. ముఖ్య విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు. భూ వ్యవహారాల్లో రైతులకు కొత్త సమస్యలు తలెత్తుతాయి. మీ సంతానానికి ఉన్నత విద్యకై చేయు యత్నాలు ఫలిస్తాయి.  
 
ధనస్సు: దైవ దర్శనాలు అనుకూలం. ఆలోచనలను కార్యరూపంలో పెట్టండి. నిరుద్యోగులకు కీలక సమాచారం అందుతుంది. వ్యాపారాలు విస్తరించి లాభాలను అందుకుంటారు. క్రమేపీ అనుకూల వాతావరణం నెలకొంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. మీ కళత్ర మెుండివైఖరి మీకు ఆందోళన కలిగిస్తుంది.  
 
మకరం: ఆదాయానికి మించి ఖర్చులు అధికమవుతాయి. ప్రైవేటు సంస్థలలోని వారు మార్పులకై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. విదేశీయానం, రుణ యత్నాలు అనుకూలిస్తాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది.  
 
కుంభం: గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి కొత్త కొత్త పథకాలు, ప్రణాళికలు రూపొందిస్తారు. ఖర్చులు అంతగా లేకున్నా ధనవ్యయం  విషయంలో ఏకాగ్రత అవసరం. ఏ విషయంలోనూ ఏకపక్ష నిర్ణయం మంచికాదని గమనించండి. రిప్రజెంటేటివ్‌లకు శ్రమకు తగిన ప్రతిఫలం కానరాదు.  
 
మీనం: కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో లౌక్యం అవసరం. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. ఉద్యోగ యత్నంలో నిరుద్యోగులకు బిడియం, అభిమానం కూడదు. వాతావరణంలో మార్పు వలన మీ పనులు అనుకున్నంత చురుకుగా సాగవు. రుణం కొంతమెుత్తం తీర్చడంతో ఒత్తిడి నుండి కుదుటపడుతారు.