శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : బుధవారం, 26 సెప్టెంబరు 2018 (08:37 IST)

26-09-2018 - బుధవారం దినఫలాలు - మీ అలవాట్లు బలహీనతనలు...

మేషం: వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. ఉద్యోగులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. ప్లీడర్లకు తమ క్లయింట్‌లు తీరు ఇబ్బందులకు గురిచేస్తు

మేషం: వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. ఉద్యోగులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. ప్లీడర్లకు తమ క్లయింట్‌లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. హోటల్, క్యాటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కుంటారు.
 
వృషభం: ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. జూదాల్లో ధననష్టం, చికాకులు ఎదుర్కుంటారు. అనుకున్నది సాధించే వరకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. విద్యార్థులు ఇతరుల వాహనం నడిపి ఇబ్బందులకు గురికాకండి.  
 
మిధునం: నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. పరిస్థితుల అనుకూలత, ఆత్మీయుల ప్రోత్సాహం ఉంటుంది. ఆదాయ వ్యయాలు ఫర్వాలేదనిపిస్తాయి. విలువైన వస్తువులు అమర్చుకుంటారు. ముఖ్యమైన పత్రాలు, నగదు, ఆభరణాలు జాగ్రత్త. మెుహమ్మాటలకు దూరంగా ఉండాలి. ఉద్యోగస్తులకు క్లయింట్ల అలవెన్సులు అందుతాయి.  
 
కర్కాటకం: వ్యాపార వార్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలు దార్లను ఆకట్టుకుంటాయి. వీలైనంత వరుకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. కొన్ని సమస్యలు చిన్నవే అయిన మనశ్శాంతి దూరంచేస్తాయి. విద్యార్థులలో నూతన ఉత్సాహం కానవస్తుంది. విశేష ధనలాభం పొందే సూచనలున్నాయి. ఆరోగ్యంలో సంతృప్తి. 
 
సింహం: మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. అనుకున్న పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి పెరుగుతుంది. కిరాణా, ఫ్యాన్సీ నిత్యవసర వస్తువ్యాపారస్తులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. ఆత్మీయుల నుండి సహాయ, సహకారాలు పొందుతారు. 
 
కన్య: ఆర్థిక విషయాల్లో స్పష్టంగా వ్యవహరించండి. మీపై శకునాల ప్రభావం అధికంగా ఉంటుంది. ఏ పనీ ముందుకు సాగక ఇబ్బందులకు గురవుతారు. ఉద్యోగస్తులకు స్థానబలం పెరుగుతుంది. పెద్దల సలహాలు మేలుచేస్తాయి. పెద్దల ఆరోగ్యం సహకరిస్తుంది. విద్యార్థులు అధిక ఒత్తిడి, మానసిక శ్రమకు గురవుతారు.  
 
తుల: ముఖ్యుల వైఖరి మీకెంతో మనస్థాపం కలిగిస్తుంది. మీ గౌరవానికి భంగం కలుగుకుండా మెలగండి. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో మార్పులుంటాయి. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ అలవాట్లు బలహీనతనలు అదుపులో ఉంచుకోవాలి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. విదేశీయానయత్నాలు ఫలిస్తాయి. 
 
వృశ్చికం: అనుకున్న పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి పెరుగుతుంది. కిరాణా, ఫ్యాన్సీ నిత్యవసర వస్తువ్యాపారస్తులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. ఆత్మీయుల నుండి సహాయ, సహకారాలు పొందుతారు. విద్యార్థులలో నూతన ఉత్సాహం కానవస్తుంది. విశేష ధనలాభం పొందే సూచలున్నాయి.  
 
ధనస్సు: దంపతుల మధ్య సఖ్యత లోపం, చికాకులు తలెత్తె ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. ధనం రాకడ, పోకడ సరిసమానంగా ఉంటాయి. వైద్య, ఇంజనీరింగ్, సాంకేతిక రంగాల వారికి పురోభివృద్ధి. నిరుద్యోగులకు మెరుగైన అవకాశం లభిస్తుంది. ట్రాన్స్‌పోర్ట్, ట్రావెలింగ్ రంగాలవారికి సామాన్యంగా ఉంటుంది.   
 
మకరం: ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతుంది. అర్థాంతంగా నిలిచిపోయిన పనులు పూర్తికాగలవు. వృత్తుల వారికి ఉన్నత అవకాశాలు లభిస్తాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. విలాసాలకు బాగా వ్యయం చేస్తారు. నిరుద్యోగులకు మెరుగైన అవకాశం లభిస్తుంది. కళా, క్రీడా, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరం. 
 
కుంభం: ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. దైవదర్శనాలు చేస్తారు. వ్యాపారులు సామాన్యంగా సాగుతాయి. ధనం మితంగా వ్యయం చేయాలి. ఉద్యోగ యత్నంలో నిరుత్సాహం వీడండి. మీ సంతానం భవిష్యత్తుపై దృష్టి సారిస్తారు. భాగస్వామిక చర్చలు ఒక కొలిక్కిరాగలవు. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. 
 
మీనం: కుటుంబీకుల మధ్య ప్రేమానుబంధాలు బలపడుతాయి. మానసిక ప్రశాంతత పొందుతారు. పొదుపుకై చేయు యత్నాలు ఫలించవు. ఉద్యోగ బాధ్యతల్లో మార్పులుంటాయి. వృత్తి వ్యాపారాలు, ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. నూతన వెంచర్లు ఏమంత సంతృప్తినీయవు. సభలు, సమావేశాల్లో ప్రముఖంగా పాల్గొంటారు.