శనివారం, 4 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : మంగళవారం, 2 అక్టోబరు 2018 (09:49 IST)

02-10-2018 - మంగళవారం దినఫలాలు - కీలకమైన వ్యవహారాలు గోప్యంగా...

మేషం: ప్రింటింగ్ రంగాల వారికి బాకీలు వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. విద్యార్థులు టెక్నికల్, కంప్యూటర్, సైన్స్, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించండి. పాత మిత్రుల కలయికతో గత అనుభవాలు జ

మేషం: ప్రింటింగ్ రంగాల వారికి బాకీలు వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. విద్యార్థులు టెక్నికల్, కంప్యూటర్, సైన్స్, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించండి. పాత మిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞాప్తికి వస్తాయి. రాజకీయనాయకులకు ఒప్పందాలు, హామీల విషయంలో పునరాలోచన మంచిది.
 
వృషభం: కొంత మెుత్తం సహాయం చేసేవారిని సంతోషపెట్టండి. ఉద్యోగస్తులు విధినిర్వహణలో ఏకాగ్రతతో పనిచేయవలసి ఉంటుంది. మీ దైనందిన కార్యక్రమాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. ఖర్చులు అధికం. విద్యార్థులు విదేశీ చదువుల కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు.  
 
మిధునం: దైవ దర్శనాలకు ధనం అధికంగా ఖర్చుచేస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ఖర్చులు అధికంగా ఉన్నా సంతృప్తినిస్తాయి. ఇతరుల సమస్యలను తేలికగా పరిష్కరిస్తారు. ఏ యత్నం కలిసిరాక నిరుద్యోగులు నిస్తేజానికి లోనవుతారు. హామీలు, మధ్యవర్తిత్వాల వలన చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. 
 
కర్కాటకం: కీలకమైన వ్యవహారాలు గోప్యంగా ఉంచండి. ఎదుటివారిని నొప్పించకూడదన్న స్వభావం అందరినీ ఆకట్టుకుంటుంది. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి నిరుత్సాహం తప్పదు. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, అధికారులతో పర్యటనలుంటాయి. ఒక పుణ్యక్షేత్రం సందర్శించాలనే ఆలోచన స్పురిస్తుంది.  
 
సింహం: వ్యాపారాభివృద్ధికి షాపుల అలంకరణ, కొత్త పథకాలు రూపొందిస్తారు. చేతి వృత్తుల వారికి ఓర్పు, నేర్పు ఎంతో అవసరం. నిరుద్యోగులకు ఆకస్మికంగా ఒక అవకాశం కలిసివస్తుంది. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో ఏకాగ్రత ముఖ్యం. మీ శ్రీమతి ప్రోద్బలంతో విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు.  
 
కన్య: ప్లీడర్లు, ప్లీడర్లకు ఒత్తిడి, ఆందోళనలు అధికం. కష్టసమయంలో ఆత్మీయుల పలకరింపు ఓదార్పునిస్తుంది. వితండవాదం, భేషజాలకు దూరంగా ఉండడం ఉత్తమం. బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. నిరుద్యోగులు బోగస్ ప్రకటనలు, సంస్థల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి. 
 
తుల: ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభిస్తారు. మీ చిన్నారుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. బంధువుల రాకపోకలు పెరుగుతాయి. వృత్తి వ్యాపార సంబంధాలు విస్తరిస్తాయి. పారిశ్రామిక రంగాల వారు ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. కోర్టు వ్యవహారాల్లో పురోగతి కనిపిస్తుంది.  
 
వృశ్చికం: చిట్క్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల ఒత్తిడి అధికమవుతుంది. మీ శ్రీమతి ప్రోద్బలంతో విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అదనపు సంపాదన కోసం మార్గాలు అన్వేషిస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. ఒకానొక నిజాన్ని ధైర్యంగా ఒప్పుకోవడంతో ఇతరులకు మీరంటే గౌరవం ఏర్పడుతుంది.  
 
ధనస్సు: ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు బాగా శ్రమించాలి. కొత్త వ్యక్తులతో పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. మీ సంతానం మెుండి వైఖరి చికాకు కలిగిస్తుంది. వృత్తుల వారు చెక్కులు చెల్లక ఇబ్బందిపడతారు. మీ మాటే నెగ్గాలన్న పట్టుదల వీడి అవతలి వ్యక్తులతో ఏకీభవించండి. 
 
మకరం: పత్రికా సంస్థలలోని వారికి పనిభారం, తోటివారి వలన మాటపడక తప్పదు. భాగస్వామిక సమావేశాల్లో మీ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియజేయడం మంచిది. స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. స్త్రీలకు కళ్ళు, తల, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది.  
 
కుంభం: ఉద్యోగస్తుల ప్రతిభఖు గుర్తింపు లభిస్తుంది. బాకీలు, ఇంటి అద్దెల వసూలులో సౌమ్యంగా మెలగాలి. వృత్తి వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. శ్రీమతి సూటిపోటి మాటలు అసహానం కలిగిస్తాయి. మీ సంతానం కోసం బాగా వ్యయం చేస్తారు. కోర్టు తీర్పులు మీకే అనుకూలం. స్టాక్‌మార్కెట్ లాభాల బాటలో పయనిస్తుంది.  
 
మీనం: తలపెట్టిన పనుల్లో ఒత్తిడి, హడావుడి ఎదుర్కుంటారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. పుణ్యక్షేత్ర సందర్శనకు సన్నాహాలు ప్రారంభిస్తారు. వృత్తిపరంగా ప్రజా సంబంధాలు బలపడుతాయి. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలు దార్లను ఆకట్టుకుంటాయి. దూరప్రయాణాలు అనుకూలిస్తాయి.