1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
  4. If you feed below items to cow, you can get rid off Debts and issues

గోమాతకి ఇవి పెడితే కలిగే ప్రయోజనాలు (Video)

feed
దానం చేస్తే పుణ్యంతో పాటు ఫలితం కూడా దక్కుతుంది. ఇక మూగజీవులకు అవి తినేందుకు పెట్టే ఆహారం వల్ల కూడా ఫలితాలు దక్కుతాయని విశ్వాసం. ముఖ్యంగా గోమాతకు ఏమేమి పెడితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాం.
 
నానబెట్టిన పచ్చి శనగపప్పు పెడితే కుటుంబ కలతలు తొలగుతాయి.
తోటకూర, బెల్లం పెడితే ప్రశాంతత లభిస్తుంది.
నానబెట్టిన కందిపప్పు పెడితే రుణ విముక్తి కలుగుతుంది.
నానబెట్టిన ఛాయ పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది.
బెండకాయలు పెడితే మనోస్థైర్యం కలుగుతుంది.
నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి, పట్టుదల లభిస్తాయి.
గోధుమ పిండి బెల్లం పెడితే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది.
వంకాయలు పెడితే సంతాన ప్రాప్తి.
బీట్ రూట్, పాలకూర పెడితే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది
టమోటాలు పెడితే వివాహ ప్రాప్తి కలుగుతుంది.
దోసకాయలు పెడితే శత్రు నివారణ జరుగుతుంది.
అరటి పళ్లు పెడితే ఉన్నత పదవి వరిస్తుంది.
పొట్టు పెసరపప్పు నానబెట్టి పెడితే బుద్ధి కుశలత, విద్యాభివృద్ధి కలుగుతుంది.
నానబెట్టిన బొబ్బట్లు పెడితే ధనాభివృద్ధి లభిస్తుంది.
నానబెట్టిన శనగలు పెడితే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది.
బంగాళ దుంపలు పెడితే నరఘోష నివారణ కలుగుతుంది.
నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది.
మినప పిండి బెల్లం పెడితే అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది.

 
About Writer
సిహెచ్