గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 జనవరి 2021 (15:14 IST)

శివునికి గరిక నీటితో శివాభిషేకం చేస్తే..? (video)

శివునికి గరిక నీటితో శివాభిషేకం చేస్తే.. నష్టమైన ద్రవ్యము తిరిగి పొందవచ్చు. అలాగే పసుపు నీటితో అభిషేకం చేసినట్లైతే మంగళప్రదం. శుభకార్యాలు జరుగుతాయి. మామిడి పండ్ల రసం చేత శివునికి అభిషేకం చేసినట్లైతే దీర్ఘకాలిక వ్యాధులు నశిస్తాయి. ఆవు పాలతో అభిషేకం చేసినట్లైతే సర్వ సౌఖ్యములను పొందవచ్చు. నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే అపమృత్యువు నశించగలదు. 
lord shiva
 
పెరుగుతో అభిషేకం చేస్తే బలం, ఆరోగ్యం చేకూరుతుంది. ఆవునేతితో శివాభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి. చెరకు రసంతో ధనవృద్ధి, మెత్తని పంచదారతో శివాభిషేకం చేస్తే దుఃఖ నాశనము కలుగుతుంది. మారేడు బిల్వ దళ జలము చేత అభిషేకం చేసినట్లైతే భోగభాగ్యాలు లభిస్తాయి. తేనెతో అభిషేకిస్తే.. తేజోవృద్ధి కలుగుతుంది. పుష్పోదకము చేత అభిషేకం చేసినట్లైతే భూలాభము కలుగుతుంది. కొబ్బరి నీటితో అభిషేకము చేసినట్లైతే సకల సంపదలు కలుగుతాయి.
 
నవరత్నోదకము చేత అభిషేకం చేస్తే ధాన్యము, గృహ, గోవృద్ధి కలుగుతుంది. కస్తూరి కలిపిన నీటితో అభిషేకం చేస్తే.. చక్రవర్తిత్వం లభిస్తుంది. నేరేడు పండ్ల రసముతో అభిషేకం చేస్తే వైరాగ్య సిద్ధి చేకూరుతుంది. ఖర్జూర రసముతో శివాభిషేకం చేస్తే.. శత్రుహానిని హరింపజేసుకోవచ్చు. 
lord shiva
 
ద్రాక్ష రసంతో అభిషేకం చేస్తే ప్రతి కార్యంలో విజయం. అన్నాభిషేకం చేస్తే మోక్షము, దీర్ఘాయువు చేకూరుతుంది. బంగారము నీటితో శివునికి అభిషేకం చేస్తే.. దారిద్ర్యం తొలగిపోతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. భస్మాభిషేకం చేస్తే మహా పాపాలు తొలగిపోతాయి. రుద్రాక్ష జలాభిషేకం చేస్తే సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి.