ఆదివారం, 24 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 డిశెంబరు 2020 (19:19 IST)

గృహంలో స్ఫటిక లింగాన్ని పూజించవచ్చా?

Spatika Lingam
గృహంలో స్ఫటిక లింగాన్ని పూజించవచ్చా అనే అనుమానం వుందా..? ఐతే ఈ కథనం చదవండి. ఇంట్లో స్ఫటిక లింగాన్ని పూజించవచ్చు. కానీ లింగానికి రోజూ పాలు, పండ్ల రసం, పరిశుభ్రమైన నీరుతో అభిషేకం చేయాలి. పువ్వులతో అర్చించాలి. ధూపదీపాలతో స్ఫటిక లింగాన్ని పూజించాలి. ఇలా చేస్తే సమస్త దోషాలు, పాపాలు తొలగిపోయి.. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. 
 
స్ఫటికంతో తయారైన విఘ్నేశ్వరుడు, శివలింగం పూజగదిలో వుంచి పూజించడం ద్వారా అనుకూల శక్తి పెంపొందుతుంది. స్ఫటిక ఏనుగును పూజగదిలో వుంచి పూజించడం ద్వారా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. స్ఫటిక లింగానికి విభూతితో అభిషేకం చేస్తే.. పాపాలు తొలగిపోతాయి. ప్రతికూలతలు వుండవు. 
 
నవగ్రహాలతో ఏర్పడే ఈతిబాధలుండవు. స్ఫటిక లింగానికి ముందు నిష్ఠతో కూర్చుని.. శివ పంచాక్షరీ మంత్రంతో 108 స్తుతించినట్లైతే కోరిన కోరికలు నెరవేరుతాయి. స్ఫటిక లింగ పూజతో అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. స్ఫటిక లింగం ముందు కూర్చుని శివ పంచాక్షరీని మాత్రమే చెప్పాలని లేదు. లక్ష్మీని స్తుతించవచ్చు. లక్ష్మీ అష్టోత్తరంతో జపించవచ్చు. తద్వారా విశేష ఫలితాలను పొందవచ్చునని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.