1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
  4. what is chidambaram secret, nataraja swami temple

వెనక్కి తిరిగి చూస్తే ఆ ఆలయ గోపురం మీ వెనుకే వచ్చేస్తుంది...ఎక్కడ?

తమిళనాడులోని కడలూర్ జిల్లాలోని చిదంబరం గురించి చెప్పగానే నటరాజ స్వామి గుర్తుకు వస్తారు. చిదంబరం అంటే ఆకాశలింగం. ఈ ఆలయంలో స్వామి నటరాజ రూపం, ఇదీ అని చెప్పలేని చంద్రమౌళీశ్వర స్పటిక లింగరూపం, ఏ రూపం లేని దైవసాన్నిధ్యం అనే మూడు స్వరూపాల్లో దర్శనమిస్తాడు

chidambaram secret
తమిళనాడులోని కడలూర్ జిల్లాలోని చిదంబరం గురించి చెప్పగానే నటరాజ స్వామి గుర్తుకు వస్తారు. చిదంబరం అంటే ఆకాశలింగం. ఈ ఆలయంలో స్వామి నటరాజ రూపం, ఇదీ అని చెప్పలేని చంద్రమౌళీశ్వర స్పటిక లింగరూపం, ఏ రూపం లేని దైవసాన్నిధ్యం అనే మూడు స్వరూపాల్లో దర్శనమిస్తాడు స్వామి. మూడో రూపమే చిదంబర రహస్యం. 
 
గర్భాలయంలో వెనుక గోడ మీద ఓ చక్రం గీసి వుంటుందట. దాని ముందు బంగారు బిల్వ ఆకులు వేలాడుతుంటాయి. అవేమీ కనిపించకుండా ఓ తెర కట్టి వుంటుంది. అర్చకులు ఆ తెరను నామమాత్రంగా తొలగించి చూపిస్తారు. ఆ ప్రదేశాన్నే శివోహంభవ అంటారు. శివ అంటే దైవం, అహం అంటే మనం. భవ అంటే మనసు, ఆ దైవంలో మనసు ఐక్యమయ్యే ప్రదేశం.. అంటే అక్కడ ఏ రూప లేకుండానే అజ్ఞానాన్ని తొలగించుకుంటూ ఆ దైవ సాన్నిథ్యాన్ని అనుభూతి చెందడమే ఈ క్షేత్ర ప్రాశస్త్యం. అదే చిదంబర రహస్యం.
 
ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే... నటరాజస్వామిని దర్శించుకుని బయటకు వచ్చి వెనుదిరిగి చూస్తే ఆలయ గోపురం మన వెనుకనే వస్తున్న అనుభూతి కలుగతుంది.
About Writer
ivr
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి
తర్వాతి కథనం
3-06-2017 మీ రాశి ఫలితాలు... అసలైన శక్తిసామర్థ్యాలు...