పుణ్యక్షేత్రం అన్నవరంలో వ్యభిచారం.. అమ్మాయిలు.. అబ్బాయిలు అరెస్టు
పుణ్యక్షేత్రంలో అసాంఘిక కార్యక్రమాలు పెరిగిపోతున్నాయి. కుటుంబ కలహాలతో ఆత్మహత్యలు, ఆవేశంతో హత్యలు, ఆలయాలకు సమీపంలో వ్యభిచార ముఠా కార్యకలాపాలు ఇలా ఎన్నో పట్టణంలో జరుగుతూనే ఉన్నాయి. కాగా అన్నవరం పుణ్యక్ష
పుణ్యక్షేత్రంలో అసాంఘిక కార్యక్రమాలు పెరిగిపోతున్నాయి. కుటుంబ కలహాలతో ఆత్మహత్యలు, ఆవేశంతో హత్యలు, ఆలయాలకు సమీపంలో వ్యభిచార ముఠా కార్యకలాపాలు ఇలా ఎన్నో పట్టణంలో జరుగుతూనే ఉన్నాయి. కాగా అన్నవరం పుణ్యక్షేత్రంలో అతి సమీపంలో ఉన్న లాడ్జిలలో గత కొన్నిరోజులుగా వ్యభిచారం నిర్వహిస్తున్న ఒక ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. లాడ్జీలు, పెద్ద పెద్ద హోటళ్ళు ఇలా ఎక్కడ పడితె అక్కడ వ్యభిచారం ఎక్కువగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడీ వ్యాధి పవిత్రమైన పుణ్యక్షేత్రాలకు కూడా పాకింది.
అన్నవరం సమీపంలోని ఓ లాడ్జిలో వ్యభిచార కార్యకలాపాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు గ్రామంలోని సినిమా సెంటర్ వద్దనున్న లాడ్జిలో తనిఖీలు చేశారు. ఇద్దరు అమ్మాయిలను, ఇద్దరు యువకులను, లాడ్జి నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొందరు భవనం వెనుక నుంచి పరారయ్యారని పోలీసులు తెలిపారు. చాలాకాలంగా లాడ్జిలో వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు.
సత్యదేవుని ముందరే ఈ పాడు పనులు జరగడం చూసి స్థానికులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అమ్మాయిలను తీసుకువచ్చే విటులకు ఈ లాడ్జిలో వసతులు కల్పిస్తున్నారని తెలుస్తోంది. దీనిపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఇటువంటి అసాంఘిక కార్యాకలాపాలకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.