నల్లపిల్లి, కన్ను అదరడం, సాయంత్రం ఇల్లు చిమ్మడం మంచిదేనా?
నల్ల పిల్లి అడ్డు పడితే అపశకునమా అనేది తెలుసుకుందాం.. నల్ల పిల్లి అడ్డంగా వెళ్తే చెడు జరుగుతుందనే నమ్మకం భారతదేశంలోనూ, పాశ్చాత్య దేశాల్లోనూ ఉంది. ఈ నమ్మకం ప్రాచీన ఈజిప్టులో మొదలైంది. అక్కడ నల్ల పిల్లులను చెడు శక్తిగా భావించేవారు. భారతదేశంలో నలుపు రంగు శని భగవానుడికి చెందినది. ఆయన కష్టాలకు అధిపతి. నల్ల పిల్లి అడ్డంగా వెళ్తే, కాస్త ఆపై వెళ్లాలి.
అలాగే కన్ను అదరడం మంచిదా, చెడ్డదా అనేది కూడా తెలుసుకుందాం.. పురుషులకు కుడి కన్ను అదిరితే మంచి అదృష్టం లేదా విజయం లభిస్తుంది. ఎడమ కన్ను అదిరితే చెడు వార్త వస్తుంది. స్త్రీలకు ఎడమ కన్ను అదిరితే మంచిది, కుడి కన్ను అదిరితే చెడ్డది.
ఇది మూఢనమ్మకం ఆధారంగా ఏర్పడింది. శరీర కదలికలు భవిష్యత్ సంఘటనల గురించి సూచనలు ఇస్తాయని నమ్ముతారు. అయితే కన్ను అదరడానికి శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. ఒత్తిడి, అలసట, మద్యం సేవించడం, కంటి అలసట, అలెర్జీ లేదా పొడిబారడం వంటివి కన్ను అదరడానికి కారణాలు కావచ్చు.
సాయంత్రం ఇల్లు చిమ్మడం అపశకునంగా భావిస్తారు. ఎందుకంటే, అది శ్రీ లక్ష్మీదేవిని బయటకు తరిమేయడంగా నమ్ముతారు. శ్రీ లక్ష్మీదేవి సంపదను, సౌభాగ్యాన్ని ప్రసాదించే తల్లి. ఆమె సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంట్లోకి వస్తుందని నమ్ముతారు.
అందువల్ల ఆ సమయంలో చిమ్మడం చేస్తే, ఆమెను బయటకు తరిమినట్లు అవుతుంది. వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు, విలువైన వస్తువులను చెత్తలో వేయకుండా ఉండటానికి ఈ అలవాటు ఏర్పడింది. కానీ నేటికీ ఇది మతపరమైన, సాంప్రదాయ కారణాల వల్ల పాటిస్తున్నారు.

