గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Modified: గురువారం, 29 నవంబరు 2018 (13:16 IST)

మోడీ, షాలకు భయపడి కేటీఆర్ డైపర్స్ వేసుకుని తిరుగుతున్నారు: ఇంద్రసేనా రెడ్డి

మోడీ, అమిత్ షాలకు భయపడి కేటీఆర్ డైపర్స్ వేసుకుని తిరుగుతున్నాడని, డిసెంబరు 7వ తేదీ తరువాత డైపర్స్ కూడా ఉండవని విమర్శించారు తెలంగాణ బీజేపీ నేత ఇంద్రసేనా రెడ్డి. ఎల్బీనగర్ ప్రచార సభలో మాడ్లాడిన ఇంద్రసేనా రెడ్డి కేటిఆర్ పెద్ద, చిన్న మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడని, బూతులు మాట్లాడటం తెలంగాణ సంస్కృతి కాదని తెలియజేశారు. 
 
హైదరాబాద్‌లో టీఆర్ఎస్ హయాంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, రోడ్ల మీద గుంతలు కూడా పూడ్చలేదని మరోమారు అభివృద్ధి పేరుతో కేసీఆర్, కేటిఆర్‌లు ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారన్నారు. మోసం చేసే వారికి ప్రజలు కర్రు కాల్చి మీద వాతలు పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.