మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : ఆదివారం, 25 నవంబరు 2018 (12:14 IST)

డిసెంబర్ 11న టీఆర్ఎస్ వందకు పైచిలుకు సీట్లతో గెలుస్తుంది.. కేటీఆర్

డిసెంబర్ 11న తెలంగాణ రాష్ట్ర సమితి వంద పైచిలుకు సీట్లతో గెలుస్తుందని.. మంత్రి కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ చాలా శక్తివంతంగా తిరిగి వస్తుందని.. హైదరాబాద్‌ను ఇంకా అభివృద్ధి చేస్తామని కేటీఆర్ చెప్పారు. మిగిలిన నగరాలతో పోల్చితే హైదరాబాద్ మార్కెట్ చాలా ఎక్కువగా వుందని మంత్రి తెలిపారు. రానున్న ఐదేళ్లలో రూ.50వేల కోట్లతో హైదరాబాదును అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. 
 
ఇప్పటికే 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు పూర్తయ్యిందని.. త్వరలో రీజనల్ రింగ్ రోడ్డు రాబోతోందని స్పష్టం చేశారు. 58 ఏళలో కాంగ్రెస్, టీడీపీ పార్టీలు 20 లక్షల ఎకరాలకు ఆయకట్టు అందిస్తే.. కేవలం నాలుగేళ్లలో టీఆర్ఎస్ సర్కారు కాళేస్వరం ప్రాజెక్టు ద్వారా 38 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బృహత్తర పథకాన్ని చేపట్టిందని తెలిపారు. 
 
వ్యవసాయం, సంక్షేమ రంగాల్లో దేశంలో ఎక్కడా లేని పథకాలను అమలు చేశామన్నారు. ఉప్పల్ వైపు నిర్మాణ రంగం కొత్త పుంతలుతొక్కుతుందని.. మెట్రో ఏర్పాటు వల్ల నగరంలో నిర్మాణ రంగం అభివృద్ధి చెందుతోందని మంత్రి తెలిపారు. సీమాంధ్ర స్నేహితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, హైదరాబాద్ అందరికి భద్రత నిచ్చే నగరమని.. మినీ ఇండియా అని కేటీఆర్ చెప్పారు.