శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : గురువారం, 22 నవంబరు 2018 (09:17 IST)

మా బావకు లక్ష మెజార్టీ రావాలి... మీదే బాధ్యత

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత కీలక మంత్రులుగా చెలామణి అయిన నేతలు హరీష్ రావు, కేటీఆర్. వీరిద్దరూ స్వయాన బావాబామ్మర్థులు. తెరాస అధినేత కేసీఆర్‌కు హరీష్ రావు స్వయానా మేనల్లుడు. తెలంగాణ రాష్ట్రంలో వీరిద్దరిదే హవా. 
 
ఈ నేపథ్యంలో డిసెంబరు ఏడో తేదీన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో సిద్ధిపేట నుంచి హరీష్ రావు, సిరిసిల్ల నుంచి కేటీఆర్, గజ్వేల్ నుంచి కేసీఆర్‌లు పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. 
 
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తన బావకు లక్ష మెజార్టీ రావాలంటూ కేటీఆర్ సిద్ధిపేట ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం కేటీఆర్‌ సిరిసిల్ల నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న క్రమంలో పొన్నాల దాబా వద్ద ఆగి చాయ్‌ తాగారు. స్థానికులతో ముచ్చటించారు.
 
అనంతరం అక్కడి నుంచి బయలుదేరే ముందు.. 'మా బావ హరీశ్‌రావుకు లక్ష మెజారిటీ దాటేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి' అని పిలుపునిచ్చారు. కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలతో కూడిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.