ASI: డ్రైవర్‌కు కళ్లు కనిపించలేదా? నీళ్ల ట్యాంకర్ ఢీకొని ఏఎస్ఐ మృతి
ASI
పీయస్ ఆర్ గార్డెన్‌లో పోలీసులు పరేడ్ నిర్వహిస్తుండగా, అనారోగ్యంతో పక్కన నిలబడ్డ ఏఎస్ఐ దేవీసింగ్ (60)ను అతివేగంగా వచ్చిన నీళ్ల ట్యాంకర్ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఏఎస్ఐ మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసులు ట్యాంకర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
వాటర్ ట్యాంకర్ ఢీకొని ఏఎస్ఐ మృతి
— ChotaNews App (@ChotaNewsApp) November 2, 2025
మేడ్చల్ జిల్లా, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పి.ఎస్.ఆర్. గార్డెన్స్‌లో విషాదం చోటుచేసుకుంది. పోలీసు పరేడ్ జరుగుతున్న సమయంలో ఆరోగ్యం సహకరించక పక్కన నిలబడ్డ ఏఎస్ఐ దేవిసింగ్ (60)ను ఓ వాటర్ ట్యాంకర్ ఢీకొట్టింది. గార్డెన్స్ నుండి బయటకు… pic.twitter.com/cI4VOq85MG
