సంబంధిత వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమలు... ఆదాయం తక్కువ చూపితే అంతేసంగతులు...
- జేఈఈ (మెయిన్స్) కీ విడుదల - ఫలితాలు రిలీజ్ ఎపుడంటే?
- 13-04-2025 నుంచి 19-04-2025 వరకు మీ వార ఫలితాలు
- అలాంటి తప్పుడు వార్తల్ని నమ్మొద్దు.. స్పష్టం చేసిన కేంద్రం
- కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా
తెలంగాణాలో మాంసం ప్రియులకు షాక్... చికెన్ దుకాణాలు బంద్...
తెలంగాణ రాష్ట్రంలోని మాంసం ప్రియులకు షాక్ తగలనుంది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి చికెన్ దుకాణాలు బంద్ కానున్నాయి. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ తగ్గించి తమను కష్టాలకు గురిచేస్తున్నాయని ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పాటించాలని తెలంగాణ రాష్ట్ర చికెన్ షాపు ఓనర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని చికెన్ సెంటర్ల నిర్వాహకులు బంద్‌కు పిలుపునిచ్చారు.
ఘట్‌కేస్‌రలోని గురుకుల్ కాలేజీ మైదానంలో శనివారం చికెన్ సెంటర్ల నిర్వాహకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పౌల్ట్రీ నిర్వాహకులు తమకు రావాల్సిన మార్జిన్‌ను ఏకపక్షంగా తగ్గించి దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. దీనివల్ల వ్యాపారం చేయడం కష్టంగా మారిందని వారు వాపోతున్నారు.
తగ్గించిన మార్జిన్‌ను తిరిగి సవరించి, తమకు న్యాయం చేసే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. ఈ బంద్‌లో రాష్ట్రంలోని అన్ని చిక్కెన్ సెంటర్ల యజమాన్లు పాల్గొంటారని చికెన్ సెంటర్ల నిర్వాహకులు వెల్లడించారు.
