1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 9 ఫిబ్రవరి 2024 (17:26 IST)

ఉద్యోగం దొరకట్లేదు.. ప్లేస్‌మెంట్ కోసం చూసి ఉరేసుకున్నాడు..

suicide
ఉద్యోగ ప్రయత్నంలో తరచుగా విఫలమవడంతో విసుగు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బషీరాబాద్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం అయ్యవారిపల్లెకు చెందిన ఎండీ మహ్మద్ (22) మైసమ్మగూడలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఈసీ 4వ సంవత్సరం చదువుతూ స్థానికంగా ఓ హాస్టల్‌లో ఉంటున్నాడు. 
 
కొంతకాలంగా ప్లేస్ మెంట్స్ కోసం ప్రయత్నిస్తున్నా ఫలితం లేకపోవడంతో ఉద్యోగం రాలేదని స్నేహితుల వద్ద వాపోయాడు. బుధవారం కళాశాలలో జరిగిన క్యాంపస్ సెలక్షన్స్‌లో మహ్మద్ ఎంపిక కాలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అతడు తన స్నేహితులు గదిలో లేని సమయంలో ఉరివేసుకున్నాడు. 
 
రాత్రి 11 గంటల సమయంలో తిరిగి వచ్చిన స్నేహితులకు మహ్మద్ ఉరివేసుకుని కనిపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.