స్నేహితులే పొట్టనబెట్టుకున్నారు.. యువతి ప్రేమ కోసం కత్తితో పొడిచి చంపేశారు... (video)
Engineering student
గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో బాలాపూర్ గణేశ్ చౌక్ వద్ద స్నేహితులకు ప్రశాంత్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. ముగ్గురు యువకులు ప్రశాంత్‌పై దాడికి పాల్పడ్డారు. అందులో ఒకడు తన వద్ద ఉన్న కత్తితో ప్రశాంత్ కడుపులో మూడుసార్లు పొడిచాడు.
ప్రశాంత్ రక్తపు మడుగులో పడిపోగానే ముగ్గురు బైక్‌పై పరారయ్యారు. సమాచారం అందుకున్న బాలాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా ప్రశాంత్ అప్పటికే మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హత్య చేసి పరారైన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
యువతి ప్రేమ విషయంలో ప్రశాంత్‌ను హత్య చేసిన స్నేహితులు
— Telugu Scribe (@TeluguScribe) August 23, 2024
బాలాపూర్‌లో మండి 37 హోటల్ వద్ద ప్రశాంత్‌ను కత్తితో పొడిచి హత్య చేసిన స్నేహితులు.
హత్య చేసి పరారైన నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో గుండెలవిసేలా రోదించిన తల్లి https://t.co/j3IfEgv9bc pic.twitter.com/F9VB6zKozR
