తొలి తెలుగు టీవీ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూత
Shantiswaroop
నవంబర్ 14, 1983న దూరదర్శన్ ఛానల్‌లో న్యూస్ రీడర్‌గా తన కెరీర్‌ని ప్రారంభించిన ఆయన ఒక దశాబ్దం పాటు టెలిప్రాంప్టర్ సహాయం లేకుండా కేవలం పేపర్లు చూస్తూ వార్తలను అందించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. 2011లో పదవీ విరమణ చేసే వరకు వార్తలు చదవడం కొనసాగించారు.
శాంతిస్వరూప్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు కూడా లభించింది. ఆయన మృతి పట్ల రాజకీయ నాయకులు, జర్నలిస్టులు సంతాపం తెలిపారు. టీవీ యాంకర్‌గా పనిచేసిన ఆయన భార్య రోజారాణి కొంతకాలం క్రితం మరణించారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
