1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Heavy Rain Alert Issued in AP from 15 October

బంగాళాఖాతంలో అల్పపీడనం.. 48 గంటల్లో వర్షాలు... ఆరెంజ్ అలెర్ట్

Rainfall
తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 48 గంటల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇంకా ఉరుములు మెరుపులతో పాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.
 
ఈ నెల 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం బలపడి తుఫానుగా మారే అవకాశం ఉంది. ఈ అల్పపీడన ప్రభావంతో అక్టోబర్ 15 నుంచి రాష్ట్రంలో వర్షాలు ప్రారంభమయ్యే సూచనలున్నాయి. ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
 
దీంతో ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాలకు ఎల్లో అలాగే ఆరెంజ్ అలర్ట్ ప్రకటించగా, తెలంగాణలోని సూర్యాపేట, వరంగల్ జిల్లాలకు వర్షం పిడుగుపాటు హెచ్చరికలు జారీ అయ్యాయి. 
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
అక్టోబర్ 10వ తేదీన 38 రైళ్లను రద్దు చేసిన రైల్వే