1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Home Minister Amit Shah To Visit Karimnagar On October 4

అక్టోబర్ 4న తెలంగాణలో పర్యటించనున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా

amit shah
కేంద్ర హోం మంత్రి అమిత్ షా అక్టోబర్ 4న తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కరీంనగర్‌లోని ఒక వైద్య కళాశాల రజతోత్సవ వేడుకల్లోనూ, ఇతర కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. కరీంనగర్‌లోని ప్రతిమ మెడికల్ కాలేజీకి షా రాక సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పరిశీలించారు. 
 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు సమక్షంలో, అప్పటి కేంద్ర హోం మంత్రి ఎల్.కె. అద్వానీ చేతుల మీదుగా 25 ఏళ్ల క్రితం ఈ కళాశాల ప్రారంభించబడిందని కరీంనగర్ లోక్‌సభ సభ్యులైన సంజయ్ కుమార్ విలేకరులకు తెలిపారు. 
 
ఈ సందర్భంగా అమిత్ షా ప్రతిమ డీమ్డ్ యూనివర్సిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అక్టోబర్ 3 రాత్రి షా హైదరాబాద్‌కు చేరుకుంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి. అక్టోబర్ 4న కరీంనగర్‌కు వెళ్లే ముందు, ఆయన మెదక్‌లో ఒక మిల్క్ చిల్లింగ్ సెంటర్‌కు శంకుస్థాపన చేస్తారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
అతి మద్యం సేవించి మరణించిన 19 ఏళ్ల యువతి? పోస్టుమార్టం తర్వాత ఆమె గుండె మాయం