తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో బోణీ కొట్టిన జనసేన
తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ బోణీ కొట్టింది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మునిసిపాలిటీలోని 15 వార్డుల్లో ఒక వార్డులో జనసేన అభ్యర్థి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ 9 వార్డుల్లోనూ, బీఆర్ఎస్ 5 వార్డుల్లో విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 116 మునిసిపాలిటీల పరిధిలోని 2586 వార్డులకు, 7 కార్పొరేషన్ల పరిధిలోని 414 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. శుక్రవారం నాడు కౌంటింగ్ ప్రారంభమైంది. లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ తన హవా సాగిస్తోంది. ఇప్పటివరకూ కాంగ్రెస్ 751 మునిసిపల్ వార్డులోలనూ, బీఆర్ఎస్ 392 స్థానాల్లోనూ, భాజపా 110 స్థానాల్లోనూ, ఇతరులు 104 స్థానాల్లో విజయం దిశగా సాగుతున్నారు.
మొత్తమ్మీద పుర, నగర ప్రజలు రేవంత్ రెడ్డి సర్కారుకే మొగ్గు చూపినట్లు కనబడుతోంది. 116 మునిసిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ 24 స్థానాల్లోనూ, బీఆర్ఎస్ 6 స్థానాల్లో విజయం దిశగా సాగుతున్నాయి.